పార్టీ కోసం పోరాడిన వారికి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం పోరాడిన వారికి గుర్తింపు

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

● మాజీ మంత్రి విడదల రజిని ● లాఠీచార్జిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పరామర్శ

యడ్లపాడు: పార్టీ కోసం కష్టకాలంలోనూ ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి నాయకుడు, కార్యకర్త కృషిని ఎప్పటికీ మరిచిపోనని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. యడ్లపాడు మండల కేంద్రంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులను ఆమె గురువారం రాత్రి పరామర్శించారు. పార్టీ నాయకులతో కలిసి బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య, కుటుంబ పరిస్థితిని, ఘటన వివరాలను తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల సమయంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను టీడీపీ శ్రేణులు అడ్డుకుని, దాడులకు పాల్పడ్డాయని ఆరోపించారు. నామినేషన్ల హక్కు కల్పించాలని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం, తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష అభ్యర్థుల పోటీకి అవకాశం లేకుండా చేసి సాధించిన ఏకగ్రీవాలు ప్రజాతీర్పు ఎలా అవుతాయని ప్రశ్నించారు. టీడీపీ నుంచి ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురైనా పార్టీ తరఫున పోటీకి ముందుకొచ్చిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల పోరాట పటిమను ఆమె అభినందించారు. పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని తెలిపారు. ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేసులు, అడ్డంకులతో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ విజయం కోసం అందరం కలిసి కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో యడ్లపాడు మండల అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి రాచమంటి చింతారావు, జిల్లా ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పందుల బుల్లబ్బాయి, యడ్లపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు కట్టా నాగార్జున, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement