108 కొత్త యూబీఐ శాఖలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

108 కొత్త యూబీఐ శాఖలు ప్రారంభం

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

● బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఆశిష్‌ పాండే ● ఘనంగా బ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవం

నరసరావుపేట రూరల్‌: యూనియన్‌ బ్యాంక్‌ 108వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 108 కొత్త శాఖలను ప్రారంభిస్తున్నట్టు బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఆశిష్‌ పాండే చెప్పారు. యూనియన్‌ బ్యాంక్‌ నరసరావుపేట ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నరసరావుపేటలోని ఎస్‌ఎన్‌ఆర్‌ కన్వెక్షన్‌ హాల్‌లో గురువారం వ్యవస్ధాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రాంతీయ కార్యాలయ అధికారి ధవళ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. బ్యాంక్‌ ఎండీ వర్చవల్‌గా మాట్లాడుతూ భారతీయ బ్యాంక్‌ ఉద్యోగుల రక్షణ నిధికి రూ.11.17కోట్లు విరాళంగా అందజేసినట్టు తెలిపారు. బ్యాంక్‌ పీఎస్‌ఆర్‌ కార్యకలాపాల కోసం రూ.13.72 కోట్లు అందించినట్టు వివరించారు. సమాజ సాధికారత, జాతి నిర్మాణం పట్ల బ్యాంక్‌ శాశ్వత నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. వ్యాపార భాగస్వాములను సమాజంలో మమేకం చేసే దిశగా పలు సూచనలు, ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. బ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నూతన శాఖలను ప్రారంబిస్తున్నట్టు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో 25శాఖలు, 51 సాధారణ శాఖలు, 16 యువ శాఖలు, తొమ్మిది స్టార్టప్‌ శాఖలు, ఏడు అగ్రి వాల్యూ చైన్‌ ఫైనాన్స్‌ శాఖలు ఉన్నట్టు వివరించారు. నూతన శాఖల ద్వారా బ్యాకింగ్‌ సేవలు ప్రజలకు సులభంగా, వేగంగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి బ్యాంక్‌ సిబ్బంది, ఖాతాదారులు, యూనియన్‌ నాయకులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement