సీసీఎల్‌ఏ ఆదేశాలు అమలు చేయండి | - | Sakshi
Sakshi News home page

సీసీఎల్‌ఏ ఆదేశాలు అమలు చేయండి

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

కలెక్టర్‌ను కోరిన వీఆర్‌ఏ సంఘ నాయకులు

నరసరావుపేట: గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) విషయంలో సీసీఎల్‌ఎ జారీచేసిన ఆదేశాలను జిల్లాలో తక్షణమే అమలు చేయాలని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బందగీ సాహెబ్‌ కోరారు. ఈ మేరకు కార్యాలయంలో కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌తో బందగీ సాహెబ్‌ మాట్లాడుతూ వీఆర్‌ఏలకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా ప్రమోషన్లు వెంటనే అమలు చేసి అర్హత ఉన్న వారికి వీఆర్‌ఓగా ప్రమోషన్లు ఇవ్వాలని, సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం పని చేయిస్తూ అక్రమ డ్యూటీలు, నైట్‌ వాచ్మెన్‌ డ్యూటీలను రద్దు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్‌ స్పంధిస్తూ వీఆర్వో ప్రమోషన్స్‌కు సంబంధించి అర్హత ఉన్న జాబితా సిద్ధం చేసి వాటిని సీసీఎల్‌ఏ కార్యాలయానికి పంపించడం జరిగిందన్నారు. తక్షణమే అన్ని తహసీల్దార్లకు సీసీఎల్‌ఏ ఆదేశాలు సర్క్యులర్‌ రూపంలో పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నకరికల్లు, ఈపూరు, క్రోసూరు మండలాల అధ్యక్షులు రోశయ్య, ఆనంద్‌ కుమార్‌, రవి, కాసులు, పున్నారావు, డేవిడ్‌, చిలకలూరిపేట మండల నాయకులు టీ.నాగేశ్వరరావు, ఏ.సుబ్బారావు, రాజుపాలెం మండల అధ్యక్షులు లింగాల సిద్దయ్య, ప్రధాన కార్యదర్శి రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement