నరసరావుపేట రూరల్: మహిళా కండక్టర్పై దాడి చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అసోసియేషన్ల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ కృతికశుక్లా, ఎస్పీ జగదీష్ అదహళ్లిని కలిసి వినతిపత్రం అందజేశారు. పల్లెవెలుగు బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళ కండెక్టర్ బి.అరుణపై ఈనెల 4వ తేదీన దాడి జరిగినట్టు తెలిపారు. గుంటూరు బస్టాండ్లోని నరసరావుపేట పాయింట్ వద్ద బస్సు నిలిపి ఉంచగా అకారణంగా కండెక్టర్పై బాణావత్తు దేవిక అనే మహిళా ప్రయాణికురాలు దాడి చేసినట్టు తెలిపారు. దీనిపై పాత గుంటూరు పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా దాడి చేసిన మహిళ మానసిక స్థితి సరిగా లేదని ఫిర్యాదు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇదే మహిళ గతంలో నరసరావుపేట బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లను దుర్భాషలాడటంతోపాటు అద్దె బస్సు అద్దాలను కూడా పగులకొట్టిందని తెలిపారు. ఆర్టీసీ యూనియన్ నాయకులు పీఎస్ రావు, కేసీ శేఖరన్, ఎ.చిన్న, జి.గోవిందు తదితరులు పాల్గొన్నారు.


