విద్యారంగ అభివృద్ధికి ఆజాద్‌ విశేష కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ అభివృద్ధికి ఆజాద్‌ విశేష కృషి

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

విద్యారంగ అభివృద్ధికి ఆజాద్‌ విశేష కృషి తూనికలు, కొలతలు శాఖ అధికారుల దాడులు కోర్టుకు వచ్చిన భార్యపై భర్త దాడి 16 నుంచి ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి పరీక్ష ఫిరంగిపురం: మండలంలోని అల్లంవారిపాలెం జెడ్పీ పాఠశాలను బుధవారం డీఈవో షేక్‌ సలీం బాషా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను పరిశీలించారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థుల ప్రోగ్రెస్‌ రికార్డులు పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతిపై తప్పనిసరిగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బోధన విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో–2 కమల్‌ ప్రసాద్‌, ఉపాధ్యాయులు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్‌ మృతి తెనాలిరూరల్‌: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్‌ మృతి చెందిన ఘటన తెనాలి బాలాజీరావుపేటలో జరిగింది. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన యల్లమాటి ప్రభాకర్‌(40) వడ్రంగి పనులు చేస్తుంటాడు. తెనాలి బాలాజీరావుపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇంటి నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు బుధవారం సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూడగా ప్రభాకర్‌ మృతి చెంది ఉన్నాడు. ఒంటిపై గాయాలతో ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. త్రీ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నరసరావుపేట రూరల్‌: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషిచేశారని జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి తెలిపారు. మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అజాద్‌ చిత్రపటం వద్ద ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అజాద్‌ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, రచయిత, పాత్రికేయుడని తెలిపారు. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని దేశ ఐక్యత, సమగ్రత, మత సామరస్యం కోసం విశేషంగా కృషిచేశారని పేర్కొన్నారు. తొలి విద్యాశాఖ మంత్రిగా ఐఐటీలు, విశ్వవిద్యాలయ అభివృద్ధికి పూనాదులు వేయడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి, ఏఆర్‌ అదనపు ఎస్పీ శేషాద్రి, ఏఆర్‌ డీఎస్పీ గాంధీరెడ్డి, ఎస్‌బీ సీఐ అంటోనీరాజు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ, గోపినాథ్‌లు పాల్గొన్నారు.

సత్తెనపల్లి: తూనికలు, కొలతల శాఖ అధికారులు పట్టణంలో బుధవారం దాడులు నిర్వహించారు. మార్కెట్‌ ప్రాంతంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. బియ్యం విక్రయించే ఒక దుకాణంలో 25 కిలోలు అని రాసి ఉన్న రైస్‌ బ్యాగ్‌ 24 కిలోలు మాత్రమే తూకం ఉండటాన్ని గుర్తించి మూడు బ్రాండ్లకు చెందిన 30 రైస్‌ బ్యాగులను సీజ్‌ చేసి మూడు కేసులు నమోదు చేశారు. అంతేకాక కాటారాళ్లకు ముద్ర లేకపోవడం, కంది పప్పు బస్తాలు తూకం తక్కువగా ఉండడంతో కేసు నమోదు చేశారు.మొబైల్‌ షాప్‌లో ఎమ్మార్పీ లేని మొబైల్‌ యాక్సెరీస్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. అధికారుల దాడులతో పలు దుకాణాలు మూతబడ్డాయి.

తెనాలిరూరల్‌: కోర్టు వాయిదాకు హాజరైన భార్యపై భర్త దాడి చేయడంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం వామనగుంటపాలేనికి చెందిన ఆరెమండ అలేఖ్యకు మూడేళ్ల కిందట అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన భోగినేని సూర్యప్రకాశ్‌తో వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 5వ తేదీన కోర్టు వాయిదాకు వచ్చి తిరిగి వెళుతున్న అలేఖ్యను టీజే కళాశాల సమీపంలో సూర్యప్రకాశ్‌ అటకాయించి ఆమైపె దాడి చేశాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించగా వన్‌ టౌన్‌ ఎస్‌ఐ రాజ్యం కేసు నమోదు చేశారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌ :గుంటూరులోని హిందూ కాలేజీ హైస్కూల్‌, మాజేటి గురవయ్య హైస్కూల్లో ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ఈనెల 16,17 తేదీల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిడెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రంతోపాటు సూచనలను జాగ్రత్తగా పరిశీలించుకుని హాజరు కావాలని సూచించారు. ఈమేరకు పాఠశాల విద్య ఆర్జేడీ మార్గదర్శకాలు విడుదల చేశారని తెలిపారు.

జెడ్పీ పాఠశాలలో డీఈఓ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement