తుపాను నష్టాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

తుపాను నష్టాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయండి

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

● 14న జిల్లాలో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటన ● జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

● 14న జిల్లాలో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటన ● జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: మురసు తుపాను ప్రభావంతో జిల్లాలో వివిధ రంగాలకు వాటిల్లిన నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈ నెల 14వ తేదీన కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయి సమాచారం, సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహించి, తుపాను కారణంగా జిల్లాలో జరిగిన నష్టాలు, చేపట్టిన సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు, నష్టాల అంచనా నివేదికలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి శాఖ తమ పరిధిలో జరిగిన నష్టాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. నష్టాలకు సంబంధించిన వివరాలను కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా స్పష్టమైన ఆధారాలతో రూపొందించాలని తెలిపారు. కేంద్ర బృందం అడిగే ప్రతి అంశానికి వాస్తవాధారిత సమాచారం అందించేలా అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలని స్పష్టం చేశారు. నష్టాల అంచనాలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని, ఏ ఒక్క ప్రభావిత ప్రాంతం, బాధిత కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు కాకుండా మిగిలిపోకూడదని కలెక్టర్‌ అధికారులకు స్పష్టం చేశారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, నిర్ణీత సమయంలో సమగ్ర నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement