కొరిటెపాడు(గుంటూరు): విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026 వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ) ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో బ్రాడీపేటలోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయంలో ఆవరణలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సామాజిక బాధ్యత, సమాజ సంక్షేమం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకునే ఉద్దేశంతో బ్యాంకు అధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఏపీజీబీ చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. చైర్మన్ ప్రమోద్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యంత గొప్ప మానవతా సేవ అని, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రక్తదానం అనేది అత్యంత గొప్ప మానవతా సేవల్లో ఒకటని, ప్రతి యూనిట్ రక్తం విలువైన ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఉద్యోగులు, ఇతరులు కలిపి సుమారు 120 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ మానవతా దక్పథాన్ని, సామాజిక బాధ్యతను చాటుకున్నారు. రక్తదాతలను, కార్యక్రమ నిర్వాహకులను బ్యాంక్ చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్, జనరల్ మేనేజర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు, హెడ్ ఆఫీస్ ఉద్యోగులు, రెడ్‌క్రాస్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
120 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం


