దాచేపల్లి: అంగన్వాడీ కేంద్రంలో బాణసంచా పేల్చి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సామగ్రి, రికార్డులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వివరాలు.. దాచేపల్లి ఎస్టీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల సముదాయంలోని అంగన్వాడీ కేంద్రం ఉంది. దీపావళి టపాసులు కాల్చి కేంద్రంలో పడేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రంలో ఉన్న రికార్డులు, సామగ్రితో పాటుగా బియ్యం, కందిపప్పు తదితర ఆహార పదార్థాలు కాలి బూడిదయ్యాయి. అంగన్వాడీ కేంద్రం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. మంగళవారం ఉదయం కేంద్రం వద్దకు వెళ్లిన తరువాత సామగ్రి, రికార్డులు కాలిపోయి ఉండటాన్ని అంగన్వాడీ కార్యకర్త జగన్నాధం ఉమమహేశ్వరి, మాయా పట్రా మేరి గుర్తించారు. స్థానికుల సహకారంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ షేక్ ఖాజావలిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
ఫర్నిచర్, రికార్డులు దగ్ధం


