న్యూస్‌రీల్
ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ అక్రమాలు, దౌర్జన్యాలతో కూటమి అభ్యర్థుల విజయం సత్తెనపల్లి మండలంలో సత్తా చాటిన వైఎస్సార్ సీపీ
అంతా ఏకపక్షమే...
ఆదివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2026
నరసరావుపేట రూరల్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమరానికి తెరపడింది. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందో తుది ఫలితాలు అద్దం పడుతున్నాయి. పచ్చమూకల దాడులు, పోలీసుల అక్రమ అరెస్టులు, బెదిరింపులను తట్టుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులు పలు చోట్ల సత్తా చాటాయి. కూటమి పాలనపై వ్యతిరేకతతో ఎన్నికలు కాస్త సజావుగా జరిగిన పలు చోట్ల వైఎస్సార్ సీపీ సత్తా చాటింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో సత్తెనపల్లి మండలంలోని పలు గ్రామాలు నిరూపించాయి. జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను శనివారం పెట్లూరివారిపాలెంలోని ఎంఎ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును విడివిడిగా చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. చివరగా సత్తెనపల్లి జెడ్పీటీసీ ఫలితం వెల్లడైంది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ జగదీష్ అదహళ్లి లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లను మాత్రమే కేంద్రంలోకి అనుమతించారు.
ఇవే అక్రమాలకు నిదర్శనం
కూటమి అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలను బట్టి ఎన్నికలు ఏకపక్షంగా నిర్వహించారో అర్థమవుతోంది. కూటమి జెడ్పీటీసీ అభ్యర్థులు విజయం సాధించిన నకరికల్లు, దాచేపల్లి, గురజాల, మాచవరం, నూజెండ్ల, క్రోసూరు, రాజుపాలెం స్థానాల్లో 20 వేల వరకు మెజారిటీలు సాధించారు. ఎన్నికల రోజు బూత్‌ల ఆక్రమణకు పాల్పడి, ఏజెంట్లను, వైఎస్సార్ సీపీ నాయకులను అరెస్టు చేశారు. పోలీసుల అండతో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీంతో ఎన్నికలు జరిగిన అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో భారీ మెజారిటీలు సాధ్యమయ్యాయి.
దౌర్జన్యాలపై పోరాడి....
జిల్లాలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగిన ఏకై క మండలం సత్తెనపల్లి. ఈ మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకంగా ఏడుగురు విజయం సాధించారు. ఇక్కడ కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. చివరి రౌండ్ వరకు ఇక్కడ పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మండలంలో ఏకగ్రీవాలు లేకపోవడం, అన్ని చోట్లా పోటీ ఉండటంతో కూటమి నాయకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు మండలంలో ఉత్సాహంగా పనిచేయడంతో కూటమి పలు గ్రామాల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది.
బ్యాలెట్ బాక్స్‌లో కరపత్రాలు
సత్తెనపల్లి మండలంలోని కంకణాలపల్లెలో రైల్వే అండర్ బ్రిడ్జిని నేరుగా నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు బ్యాలెట్ బాక్సుల్లో ఓటుతో పాటు కరపత్రాలు వేశారు. యూ ఆకారంలో అండర్‌బ్రిడ్జి నిర్మించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడతామని వారు తెలిపారు.
జెడ్పీటీసీ విజేతలు వీరే..
నరసరావుపేట రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ శనివారం నిర్వహించారు. జిల్లాలో 28 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 18 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 10 స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. అన్ని స్థానాలలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో 419 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 382 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 37 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. టీడీపీ 22, వైఎస్సార్ సీపీ 9, జనసేన 3, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గెలుపొందారు. నకరికల్లు – డాక్టర్ నాగోతు వెంకటలక్ష్మీ సరోజ , పిడుగురాళ్ల – డాక్టర్ ఉన్నం మాధవి, మాచవరం– కత్తి సరోజిని, గురజాల– మాదినేని లక్ష్మి, దాచేపల్లి–వేముల నాగమణి, రాజుపాలెం – పల్లపాటి పెద్దిరాజు, నూజెండ్ల – సింగంశెట్టి వెంకటబాలప్రసాద్, క్రోసూరు – పమిడిపాటి శ్రీనివాసరావు, ముప్పాళ్ల– బొర్రా అనిత, సత్తెనపల్లి – కట్టా రమేష్‌లు జెడ్పీటీసీలుగా విజయం సాధించారని అధికారులు చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అక్రమాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ పలు జెడ్పీటీసీ స్థానాల్లో కౌంటింగ్‌ను బహిష్కరించింది. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, గురజాల జెడ్పీటీసీ స్థానాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థుల తరఫున ఏజెంట్లు కౌంటింగ్‌కు హజరుకాలేదు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపై దాడులకు టీడీపీ మూకలు పాల్పడ్డాయి. పలు గ్రామాల్లోని ఏజెంట్లను పోలీసులే ఎత్తుకెళ్లారు. ఏకపక్షంగా సాగిన ఎన్నికల తీరును నిరసనగా కౌంటింగ్‌ను బహిష్కరించినట్టు వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు.
కూటమి నాయకుల దాడులు, పోలీసుల బెదిరింపులు, అక్రమ అరెస్టులతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏకపక్షంగా మారింది. పోలీసుల అండతో పచ్చమూకలు నామినేషన్ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. తీవ్రంగా శ్రమించి నామినేషన్లు వేసిన కొంతమంది అభ్యర్థులను పోలీసుల అక్రమ కేసుల బెదిరింపులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. జిల్లాలో 419 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 382 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 37 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అలాగే, 28 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 18 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పది స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎక్కువ స్థానాలు కూటమి గెలిచినా అది ఎంతవరకు ప్రజాస్వామ్యబద్ధమో అని చర్చించుకుంటున్నారు.
అందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపేదే దీపావళి పండుగ. పర్వదినాల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వ్యాపారులూ ఆశిస్తుంటారు. దీపావళికి కొద్ది రోజులు కష్టపడితే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని భావిస్తారు. ఇలా దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారుల నుంచి కొందరు కూటమి నేతలు మామూళ్ల రూపంలో ఎడాపెడా బాదేస్తున్నారు. మళ్లీ బాణసంచా గిఫ్ట్‌లు వేరు. అధికార పార్టీ నాయకుల తీరు కారణంగా వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఎంపీటీసీ విజేతల వివరాలు..
ఎన్నికలు జరిగిన స్థానాలు 37
వైఎస్సార్ సీపీ 9
టీడీపీ 22
జనసేన 3
ఇండిపెండెంట్‌లు 3


