ఓట్ల లెక్కింపునకు వచ్చిన సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే కేంద్రానికి వచ్చిన సిబ్బందికి టిఫిన్లు అందలేదు. బయటకు వెళ్లలేక ఆకలితోనే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల ఏజెంట్లకు భోజనాలు అందలేదు. భోజనాల కోసం కౌంటింగ్ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఆరా తీయడం కనిపించింది. ట్రక్కులో భోజనాలు తీసుకువచ్చి పైనుంచి విసరడంపై ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


