నరసరావుపేట ఈస్ట్: దక్షిణ భారతదేశ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థి సంకా కౌశిక్ ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకం కై వసం చేసుకున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్రప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేరళం రాష్ట్రంలోని కన్నూర్‌లో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణ భారత పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్– ఎక్విప్డ్, క్లాసిక్ పోటీలలో కౌశిక్ 93 కిలోల ఎక్విప్డ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడని వివరించారు. కౌశిక్ స్క్వాట్ 272.5 కిలోలు, బెంచ్ ప్రెస్ 200 కిలోలు, డెడ్‌లిఫ్ట్ 240 కిలోలు బరువు సాధించి విజేతగా నిలిచాడని పేర్కొన్నారు. కళాశాల కార్యదర్శి రాయల శ్రీనివాసరావు, చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు, ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు ఓగూరి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సూదా సురేష్‌బాబు, పాశం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణకిషోర్, వ్యాయామ అధ్యాపకుడు రాజామెర్సిన్‌బాబు, ఎన్.కృష్ణంరాజు, అధ్యాపకులు అభినందించారు.
వైఎస్సార్ సీపీ నాయకులపై
అక్రమ కేసులు నమోదు
వినుకొండ: మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేపథ్యంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై వినుకొండ పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. టీడీపీ ప్రచార వాహన డ్రైవర్ పఠాన్ మొహమ్మద్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సబ్ ఇన్‌న్‌స్పెక్టర్ పసుపులేటి నరేష్‌కుమార్ ఈ కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే వైఎస్సార్ సీపీ అభ్యర్థి పఠాన్ సేలేహా ఖాన్ (పి.ఎస్.ఖాన్) ఆయన మద్దతుదారులు గంటా ఖాజా, షేక్ షాహుల్, షేక్ సుభాని, గంటా జహంగీర్, పసుపుమర్తి షేక్ నాగూర్ బాషా, షేక్ మస్తాన్ వాలి, పట్టా యాసిన్, షేక్ ఇమ్రాన్, సయ్యద్ రహీమ్, పఠాన్ నాన్నే ఖాన్, పట్టా మహ్మద్ ఇర్ఫాన్, కారుమంచి సుభాని, కోట్ల ఇమ్రాన్ ఖాన్, షైక్ అహ్మద్ వాలి, షైక్ పెద్ద రుక్కు, షైక్ జానీబాషా, సయ్యద్ నూర్ ఆసిఫ్, షైక్ అబ్దుల్ అమీర్, పుసలపల్లి షైక్ కరీమ్ బాషా, అద్దంకి గౌస్ బాషా, హబీబుల్లా, రఫీ, రోషన్ జమీర్, గొట్టం వెంకటేష్, డ్రైవర్ వీరంజ్ తదితరులపై అక్రమ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని బాధితులు తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
లక్ష్మీపురం: గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటనపై నగరంపాలెం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు చుట్టుగుంట నుంచి ఎత్తు రోడ్డు వెళ్లే మార్గంమధ్యలోని ఐటీసీ కంపెనీ వద్ద గల బస్టాప్ వద్ద అక్టోబర్ 30వ తేదీ ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో సుభాని (65) స్పృహ కోల్పోయి పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు ఆసుపత్రిలో వివరాల సేకరించగా ఎలాంటి సమాచారం తెలియకపోవడంతోపాటు మృతి చెందిన వృద్ధుడి పేరు మాత్రం సుభాని అని తెలిసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9154880585, 8688831340 నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం తెలియజేయాలని తెలిపారు.
ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ అప్పగింత
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌ను, అందులో ఉన్న నగదును సంబంధిత మహిళకు అప్పగించిన సంఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన దుర్గాభవాని సీతానగరం ఆటో ఎక్కి కేఆర్ మార్కెట్‌కు వచ్చింది. హడావుడిలో తన బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయి ఆటో దిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత తన బ్యాగ్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి స్థానికంగా విచారించినా ఫలితం కనపడలేదు. దాంతో వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు వచ్చి వివరించగా వారు సీసీ ఫుటేజ్ ద్వారా ఆటోను గుర్తించారు. ఆటోను ట్రేస్ చేసి పట్టుకోగా వెనుక సీటు వైపు బ్యాగ్ కనిపించింది. అందులో ఉన్న రూ.45 వేలు నగదు అందులోనే భద్రంగా ఉంది. దాంతో పోలీసులు ఆ బ్యాగ్‌ను దుర్గాభవానికి అప్పగించారు.


