సత్తెనపల్లి: మురసు తుఫాన్ నేపథ్యంలో వరద నీటి వల్ల దెబ్బతిన్న పంటలకు ఆశించే తెగుళ్లు, కీటకాల నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ వెంకట్రావు అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వరదనీటి వల్ల దెబ్బతిన్న మిర్చి, బొప్పాయి, అరటి, కంద పంటలను శనివారం శాస్త్రవేత్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజిని పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి దెబ్బతిన్న పంటలు త్వరగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలను వివరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకట్రావు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందించే ఎంఐడీహెచ్ పథకాలను, పంట విస్తరణ కార్యక్రమాలను, పందిరి సాగు విధానాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఉద్యాన శాఖ అధికారిని బి జ్యోతి, రైతు సేవా కేంద్రం సిబ్బంది శివశంకర్, శాంతిశ్రీ, సాయి, అబ్బూరు, గుడిపూడి గ్రామాల రైతులు ఉన్నారు.


