గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఫార్మశీ కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల పురుషుల చెస్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచి ఆరుగురు క్రీడాకారులు దక్షిణ భారత స్థాయి చెస్ టోర్నమెంట్‌లో ఏఎన్‌యూ జట్టు తరుపున పాల్గొని ప్రతిభ చూపారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వడ్లమూడి పల్లవి తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఏఎన్‌యూ పరిధిలోని వివిధ కళాశాలల నుంచి ఎంపికై న ప్రతిభావంతులైన క్రీడాకారులతో కూడిన జట్టు ఈ పోటీల్లో పాల్గొని ఏఎన్‌యూకి ప్రాతినిధ్యం వహించడం విశేషమన్నారు. జట్టుకు హర్షిత్ వర్ధన్ గెదెల (జేసీ కళాశాల), ఆర్.వి.ఆర్.అండ్ జె.సి.కళాశాలకు చెందిన ఇస్మాయిల్ ఎం.డి పవనకృష్ణ, ప్రసాద్, జి.అంజనికుమార్‌రెడ్డి, అభినయ్ ఎంపికయ్యారని తెలిపారు. జట్టుకు టీమ్ మేనేజర్‌గా చలపతి ఫార్మసీ కళాశాలకు చెందిన ఫీజికల్ డైరెక్టర్ పి.భానుప్రకాష్ వ్యవహరించనున్నారని తెలిపారు. చలపతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వై.వి.ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపాల్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


