మాతాశిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోండి

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

సెకండరీ హెల్త్‌ సర్వీసెస్‌ డెప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ సుజాత

నరసరావుపేట టౌన్‌: మాతాశిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సెకండరీ హెల్త్‌ సర్వీసెస్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ సుజాత తెలిపారు. శిశుమరణాలపై విచారణ చేపట్టేందుకు ఆమె శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. ఆమె మాట్లాడుతూ వైద్యశాలలోని క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, బ్లడ్‌ బ్యాంకులను పరిశీలించామన్నారు.

బ్లడ్‌ బ్యాంకులో రోగులకు సరిపోను రక్తం అందడం లేదని ఫిర్యాదులు ఉన్నాయన్నారు. లోపాన్ని భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైద్యశాల పనితీరు, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలను మెరుగుపరచడానికి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. వైద్యశాలలో శస్త్ర చికిత్సలు, రిఫరల్స్‌ ఎక్కువగా ఉంటున్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లగా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ప్రసూన, ఆర్‌ఎంఓ డాక్టర్‌ ఏడుకొండలు, పలువురు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement