చిలకలూరిపేట: మురసు తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలులకు పలు ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ పరిధిలో ఉన్న కాణిపాకం విఘ్నేశ్వర కోల్డ్ స్టోరేజ్ కు సంబంధించిన 100 కేవీ సోలార్ యూనిట్ ధ్వంసమై భారీ నష్టం వాటిల్లింది. వీచిన తీవ్ర గాలులకు కోల్డ్ స్టోరేజ్ భవనంపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్లు ధ్వంసమయ్యాయి. సుమారు రూ.60 లక్షల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు కోల్డ్ స్టోరేజ్ మేనేజింగ్ పార్టనర్ ఎన్ హరిబాబు తెలిపారు.


