జిల్లా వ్యాప్తంగా 70.93 శాతం పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా 70.93 శాతం పోలింగ్‌

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

జిల్లా వ్యాప్తంగా 70.93 శాతం పోలింగ్‌

ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ పర్వం సత్తెనపల్లి మండలంలో అత్యధికంగా 76.57 శాతం గురజాల నియోజకవర్గంలో ఏకపక్షంగా సాగిన పోలింగ్‌ పలు చోట్ల రిగ్గింగ్‌, దొంగ ఓట్లు వేయించిన కూటమి నేతలు

ముప్పాళ్లలో సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్న ఎస్పీ జగదీష్‌ అదహళ్లి

ధూళ్లిపాళ్లలో బూత్‌ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

సత్తెనపల్లి: జిల్లాలోని 28 జెడ్పీటీసీలకు గాను 18, 419 ఎంపీటీసీ స్థానాలకు గాను 382 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 10 జెడ్పీటీసీ స్థానాలు, 37 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. నిర్ణీత సమయం 5 గంటలు దాటిన తర్వాత కూడా కొందరు క్యూ లైన్‌లో ఉండటంతో ముందుగా స్లిప్పులు ఇచ్చి వారికి ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. తొలుత మందకొడిగా సాగినా క్రమంగా పెరిగింది. జిల్లాలో 4,60,784 మంది ఓటర్లకు గాను 576 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,26,850 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు 1,66,733 ఉండగా పురుషులు 1,60,114 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. 70.93 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా సత్తెనపల్లి మండలంలో 76.57, అత్యల్పంగా రాజుపాలెం మండలంలో 51.47 శాతంగా నమోదైంది. పలుచోట్ల వసతులు లేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.

అంతా దౌర్జన్యం

జిల్లాలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, నకరికల్లు, రాజుపాలెం, నూజెండ్ల, క్రోసూరులో ఏకపక్షంగా జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. కూటమి నేతలు పోలింగ్‌ కేంద్రాలలోకి చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ముప్పాళ్ళ మండలంలో భారీగా దొంగ ఓట్లు వేయించారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను తీసుకొచ్చి స్లిప్పులు ఇచ్చి పంపి చనిపోయిన వారివి, ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారి ఓట్లను వేయించారు. కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీకి చెందిన వారిని అక్రమంగా అదుపులోకి తీసుకోవడం, వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు చేయడం వంటివి చేశారు. మీడియాకు సైతం ఆంక్షలు విధించారు. పలు పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష, జిల్లా జనరల్‌ అబ్జర్వర్‌ నూపూర్‌, జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి సందర్శించి పోలింగ్‌ సరళిని తెలుసుకున్నారు.

జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌ వివరాలు...

మండలం ఓటర్లు పోలైన పోలింగ్‌

ఓట్లు శాతం

చిలకలూరిపేట 3,913 2,355 60.18

దాచేపల్లి 34,664 26,426 76.23

గురజాల 34,247 25,975 75.85

క్రోసూరు 50,661 38,007 75.02

మాచవరం 43,454 26,795 73.17

ముప్పాళ్ళ 35,781 25,568 71.46

నూజండ్ల 46,617 32,575 69.88

నకరికల్లు 54,301 38,124 70.21

పిడుగురాళ్ల 52,607 36,692 69.75

రాజుపాలెం 42,683 21,968 51.47

సత్తెనపల్లి 61,856 47,365 76.57

మొత్తం 4,60,784 3,26,850 70.93

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement