పోలింగ్‌ వేళ పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ వేళ పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

జెడ్పీటీసీ అభ్యర్థిపై అత్యుత్సాహం పోలింగ్‌ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న చిలకలూరిపేట సీఐ కారు అనుమతులు ఉన్నా వెళ్లటానికి వీల్లేదని దబాయింపు కారులో పోలీస్‌స్టేషన్‌కి తరలింపు

దాచేపల్లి : పచ్చ చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తలు మాదిరిగా పోలీసులు వ్యవహరించారు. ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్‌ సీపీ దాచేపల్లి జెడ్పీటీసీ అభ్యర్థి తండా అబ్దుల్‌సత్తార్‌ ఎన్నికల పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు గురువారం అడ్డుకున్నారు. దాచేపల్లి నుంచి భట్రుపాలెం వెళుతుండగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న చిలకలూరిపేట సీఐ బి. సుబ్బనాయుడు జెడ్పీటీసీ అభ్యర్థి అబ్దుల్‌సత్తార్‌ని అడ్డుకుని బెదిరించాడు. భట్రుపాలెం, కాట్రపాడులో కూటమి నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, మీరు అక్కడికి వెళ్లితే గొడవలు జరుగుతాయని సీఐ సుబ్బ నాయుడు చెప్పి పోలింగ్‌ పరిశీలనకు వెళ్లకుండా అబ్దుల్‌సత్తార్‌ని అడ్డుకుని నడిరోడ్డుపై ఇబ్బంది పెట్టారు. ఎన్నికల అధికారులు నాకు అనుమతి ఇచ్చిన కారులోనే తన ఛీప్‌ ఏజెంట్‌తో కలిసి వెళుతున్నానని, దయ చేసి నన్ను ఆపవద్దని అబ్దుల్‌సత్తార్‌ దండం పెట్టి వేడుకున్నారు. అయినా సీఐ కనికరం చూపకుండా జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న అబ్దుల్‌సత్తార్‌ హక్కులను కాలరాశాడు. సీఐని ఎంతసేపు బతిమాలినా వినకుండా ముందుకు వెళ్లటానికి వీల్లేదని సత్తార్‌ కారుకి పోలీసుల కారుని అడ్డుగా పెట్టారు. దాచేపల్లి సీఐ షేక్‌ ఖాజవలికి సీఐ సుబ్బ నాయుడు ఫోన్‌ చేసి అబ్దుల్‌సత్తార్‌తో మాట్లాడించారు. అబ్దుల్‌సత్తార్‌పై సీఐ ఖాజవలి ఫోన్‌లోనే విరుచుకు పడ్డారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదని, ఎక్కువ చేస్తే కేసులు పెడతానని హెచ్చరించారు. అనంతరం జెడ్పీటీసీ అబ్దుల్‌సత్తార్‌తో పాటుగా వెంట ఉన్న నాయకులందరినీ పోలీస్‌ స్టేషన్‌కి కారులో తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో గంటల తరబడి ఉన్న తరువాత బయటకు పంపించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని అబ్దుల్‌సత్తార్‌ తప్పుబట్టారు. జెడ్పీటీసీ అభ్యర్ధి అబ్దుల్‌సత్తార్‌ భట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలకు వెళ్లకపోవటంతో అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement