సంకెళ్ల చెరవీడి 4వ సారి విజయం | - | Sakshi
Sakshi News home page

సంకెళ్ల చెరవీడి 4వ సారి విజయం

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

సత్తెనపల్లి:మున్సిపల్‌ ఎన్నికల్లో సంకెళ్ల చెరవీడి ఆ కుటుంబం 4వ సారి విజయం సాధించింది. 2005, 2014, 2021 మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్‌ ఎన్నికల్లో ఒక సారి భర్త, రెండు పర్యాయాలు ఆమె విజయం సాధించినప్పటికీ ఈ విడత జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుఫున 12వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి పెద్దింటి గోవిందమ్మను ఎలాగైనా ఓడించాలని కూటమి నేతలు పథకం పన్నారు. దీంతో నామినేషన్‌ ఉపసంహరణ సమయంలో అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఫలించలేదు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ముగ్గురు ఏజెంట్లను మద్యం కేసులో జైలు పాలు చేశారు. అప్పటికప్పుడు మళ్లీ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు సిద్ధమవ్వగా గత నెల 31న అర్ధరాత్రి సమయంలో పెద్దింటి గోవిందమ్మ భర్త పెద్దింటి వెంకటేశ్వర్లు(చిట్టి), ఆమె బావ శంకరరావును ప్రివెంట్‌ బైండోవర్‌ కింద పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. కేవలం ఎన్నిక రోజు ఓటెయ్యటానికి తీసుకొచ్చి ఎన్నిక పూర్తయ్యే వరకు బయటకు పంపలేదు. ఎన్నిక సమయంలో భర్త పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నప్పటికీ కుమారుడు దీప్‌చంద్‌ ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తుండగా నలుగురు గుర్తు తెలియని మాస్కులు ధరించిన యువకులు దీప్‌చంద్‌ను కిడ్నాప్‌ చేసి కొంత సమయం తర్వాత వదిలిపెట్టారు. చివరకు గోవిందమ్మ ఓటర్లకు దండం పెట్టడం తప్ప మరేమీ చేయలేకపోయింది. కానీ మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్‌ కౌంటింగ్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభమయ్యాక మొదటి రౌండ్‌లో జరిగిన ఓట్ల లెక్కింపు లో పెద్దింటి గోవిందమ్మ 55 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఎన్ని కేసులు పెట్టినా ప్రజాక్షేత్రంలో ఆమె విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. హ్యట్సాప్‌ గోవిందమ్మ అంటూ పలువురు ఆమెను అభినందించగా ఆమె మాత్రం చిరునవ్వుతో వార్డు ప్రజలు తన పై పెట్టుకున్న నమ్మకానికి ఆమె చేతులు జోడించి కృతజ్ఞతలు తెలి పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement