శుభ్రతకు పెద్దపీట
పీఆర్కే సోదరులకు సమన్లు ఇచ్చేందుకు సీఐ యత్నం
సత్తెనపల్లి: సత్తెనపల్లి సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ నాగూర్ మీరాన్ పేర్కొన్నారు. పట్టణంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.... ‘‘ పట్టణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. నవంబర్ 1న జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో పట్టణ ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే ప్రజల నమ్మకాని నిలబెట్టుకుంటా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు పరచటంలో పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో మున్సిపల్ పరిధిలో నిధులు లభ్యత తక్కువగా ఉన్నా ఆదాయాన్ని పెంచి పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు అభివృద్ధి పనులు చేపడుతా. నిధుల దుర్వినియోగం తగ్గించి ప్రాధాన్యతా క్రమంలో సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే లోటు ఉండదు. పట్టణంలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.
తాగునీటి సరఫరాపై దృష్టి
ప్రధానంగా మంచినీటి సరఫరా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అన్ని వార్డులకు పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి ప్రతిరోజు తాగునీరు సరఫరా చేయగలగాలి. వీధిదీపాలు సక్రమంగా వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధిదీపాలు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచటంతోపాటు ప్రతిరోజు ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చర్యలు చేపడతా. పట్టణ ప్రజలకు అన్ని వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు రూపొందించా. మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్లను విస్తరించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి.
మాచర్ల: మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో టీడీపీలో అంతర్గత పోరుతో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో వైఎస్సార్ ీసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని అక్రమంగా కేసులో ఇరికించారు. ఈ కేసులో వారు జైలుకు వెళ్లి, బెయిల్‌పై విడుదలై వచ్చారు. జైలులో ఉన్న సమయంలో వారిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. అయినా పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో మళ్లీ గురువారం కోర్టు సమన్లను వెల్దుర్తి ఎస్‌ఐ సత్యనారాయణ వారికి అందించేందుకు కార్యాలయానికి వచ్చారు. వారు అందుబాటులో లేరని, వారి కార్యాలయంలో సంబంధించి సమాచారం అందించామని, వారికి ఫోన్ సమాచారం అందించామని చెప్పి వెనుదిరిగి వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో పురపాలక సంఘంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరూ స్వత్రంత అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. కోర్టు సమన్లు పేరుతో ఇలా ఎస్‌ఐ రావడం చర్చనీయాంశమైంది.
స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య పేరుతో ఏర్పాటు చేసిన వావిలాల స్మృతివనం నిర్వహణతో ప్రజలకు ఆహ్లాదం అందించేలా చేయాల్సి ఉంది. నరసరావుపేట రోడ్‌లోని చెత్తతో నిండి ఆ ప్రాంత వాసులు దుర్గంధంతో అల్లాడుతున్న డంపింగ్‌యార్డ్‌ను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో శుభ్రం చేయించగలిగాం. మాచర్ల రోడ్‌లో ఉన్న డంపింగ్‌యార్డ్‌ను కూడా పూర్తిస్థాయిలో శుభ్రం చేయించాలి. ముఖ్యంగా పరిపాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా సేవలందిస్తా. కౌన్సిలర్‌గా, మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉంది. చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తా. ప్రజామోదం మేరకు అభివృద్ధి పనులు చేపట్టడంలో పట్టణంలోని 36 వార్డులను సమాన దృష్టితో చూస్తా. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.’’
వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్
అభ్యర్థి నాగూర్‌మీరాన్


