పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: ఎన్నికల నిర్వహణలో ఆర్‌ఓల పాత్ర ఎంతో బాధ్యతాయుతమైనదని, ప్రతి అంచెనూ పకడ్బందీగా అమలు చేస్తూ, జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా వారు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఆర్‌ఓ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్‌ స్టేషన్లలో సిబ్బంది నియామకం, అక్కడ నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలింగ్‌ ప్రారంభం నుంచి ప్రక్రియ ముగిసే వరకు పోలింగ్‌ కేంద్రం లోపల, వెలుపల జరిగే ప్రతి పరిణామాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ మొదలుకొని ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు అధికారుల ప్రవర్తన బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు.

అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలి

నామినేషన్‌ కేంద్రాలకు రాకుండా ఎవరైనా అభ్యర్థులను అడ్డుకున్నట్లు ఫిర్యాదు అందినా, లేదా తమకు రక్షణ కల్పించాలని అభ్యర్థులు లిఖితపూర్వకంగా కోరినా వెంటనే స్పందించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తక్షణమే సదరు దరఖాస్తును స్థానిక పోలీసు అధికారులకు పంపి వారికి పోలీసు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని రిటర్నింగ్‌ అధికారులను ఆమె హెచ్చరించారు. అలాగే, బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థుల గుర్తులను తప్పనిసరిగా తెలుగు వర్ణమాల క్రమంలోనే అమర్చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement