వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు పట్టం కట్టండి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు పట్టం కట్టండి

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు పట్టం కట్టండి

● కూటమి అరాచకాలకు చరమగీతం పాడాలి ● ఓటర్లకు మాజీ మంత్రి విడదల రజిని పిలుపు

చిలకలూరిపేట: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు పట్టం కట్టాలని మాజీ మంత్రి విడదల రజిని పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా గురువారం రాత్రి పట్టణంలోని 4, 5, 6, 10 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తోందని విమర్శించారు. ఈ అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో అంతులేని అక్రమాలు, దౌర్జన్యాలు సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి, సంక్షేమమే అజెండా..

గత వైఎస్సార్‌ సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన కొనసాగించారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా వాటిని కార్పొరేట్‌ స్థాయికి తీర్చిదిద్దిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. దీనికి తోడు కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, పాత వాటిని అభివృద్ధి పరిచారని గుర్తు చేశారు. వివిధ పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాభివృద్ధిలో భాగంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు, పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో మెరుగైన పాలన కోసం వైఎస్సార్‌ సీపీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ దరియావలి, 4, 5, 6, 10 వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థులు కవల నాగయ్య, షేక్‌ కరిమున్‌, షేక్‌ మాబు సుభాని, కుడారి మరియమ్మ, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement