సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ జీవించండి | - | Sakshi
Sakshi News home page

సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ జీవించండి

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ జీవించండి విరిగిన రైల్వే గేటు పోలీసు అమరవీరులకు ఘన నివాళి పలు రైళ్లు రద్దు వేదాలు సనాతన ధర్మానికి ప్రతీకలు

తాడేపల్లి రూరల్‌: త్రిదండి చిన్న జీయర్‌ స్వామి గురువారం తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రానికి విచ్చేసి భక్తులకు తీర్థగోష్టిని అనుగ్రహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్‌స్వామి వారు విజయకీలాద్రి దివ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ వైష్ణవ దీక్షను స్వీకరించాలనే ఆసక్తి కలిగిన భక్తులకు మంత్రోపదేశాన్ని అనుగ్రహించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ భగవంతుని పట్ల విశ్వాసంతో, తోటి మానవుల పట్ల ప్రేమాభిమానాలతో, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ జీవించాలని భక్తులకు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు.

దుగ్గిరాల: దుగ్గిరాల రైల్వే గేటు గురువారం విరిగిపోయింది. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం సమయంలో రైల్వే గేటు కొద్దిగా విరిగింది. గేటు తీయలేక పోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. పాఠశాలల బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనదారులు చిలువూరు గ్రామం మీదుగా వెళ్లాల్సి వచ్చింది. మంచికలపూడి దగ్గర ఆర్‌యూబీ నిర్మాణ పనులు జరుగుతుండటంతో, దుగ్గిరాల గేటు దగ్గర ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు.

మంగళగిరి టౌన్‌: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం మంగళగిరిలోని ఆరో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక పోలీసు (ఏపీఎస్పీ) బెటాలియన్‌లో అమరవీరులకు నివాళులర్పిస్తూ ప్రత్యేక వాయిద్య కార్యక్రమాన్ని నిర్వహించారు. బెటాలియన్‌ బ్రాస్‌ బ్యాండ్‌ బృందం, హెడ్‌ క్వార్టర్స్‌కు చెందిన పైప్‌ బ్యాండ్‌ బృందం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. బెటాలియన్‌ కమాండెంట్‌ ఎ.మురళి, అడిషనల్‌ కమాండెంట్‌ డి.ఆశీర్వాదం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బెటాలియన్‌ అధికారులు, సిబ్బందితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ బ్యాండ్‌ బృందాలు వివిధ దేశభక్తి గీతాలను వాయించాయి.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. ఈ నెల 29వ తేదీన సికింద్రాబాద్‌ – హౌరా (12704), సికింద్రాబాద్‌ – భువనేశ్వర్‌ న్యూ (17016), షాలీమార్‌ – చర్లపల్లి (18045) రైళ్లను రద్దు చేశారు. చర్లపల్లి – షాలీమార్‌ (08046) రైలు ఈ నెల 31వ తేదీన రద్దయింది. ఎంజీఆర్‌ చైన్నెసెంట్రల్‌ – హౌరా (12840), ఖరగ్‌పూర్‌ – విల్లుపురం (22603), భువనేశ్వర్‌ న్యూ – సీఎస్‌టీ ముంబై (11020) రైళ్లు ఈ నెల 29న, షాలీమార్‌ – చర్లపల్లి (08045) ఈ నెల 30న, చర్లపల్లి – షాలీమార్‌ (08046) ఈ నెల 31న పూర్తిగా రద్దు చేశారు.

విజయవాడ కల్చరల్‌: తిరుమల తిరుపతి దేవస్థానం, లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో తయాహ్నిక సంపూర్ణ వేదపారాయణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల వేద పండితులు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాన్ని పారాయణం చేశారు. ఈ కార్యక్రమం పర్యవేక్షకుడు గుళ్లపల్లి చినఆంజనేయులు మాట్లాడుతూ.. వేదాలు భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక లని అన్నారు. వేదాలను పరిరక్షించుకోవడం మన ధర్మమని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement