కుతంత్రాల ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

కుతంత్రాల ఏకగ్రీవం

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 కుతంత్రాల ఏకగ్రీవం నరసరావుపేట టౌన్‌: పల్నాడు జిల్లాలో 419 ఎంపీటీసీ స్థానాలకు గాను 378 స్థానాలు, 28 జెడ్పీటీసీ స్థానాల్లో 18 స్థానాలు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు కావడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఈ ఫలితాలను అధికార పార్టీ తమ విజయంగా అభివర్ణిస్తుండగా, ప్రతిపక్షం తమ అభ్యర్థులను నామినేషన్ల దశలోనే అడ్డుకున్నారని స్పష్టం చేస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ అభ్యర్థులు అడ్డదారిలో ఏకగ్రీవమయ్యారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగడం చట్టవిరుద్ధం కాదు. పోటీలో ఒక్క అభ్యర్థి మాత్రమే మిగిలినప్పుడు నిబంధనల ప్రకారం ఏకగ్రీవంగా ప్రకటించవచ్చు. అయితే, నామినేషన్ల సమయంలోనే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను అడ్డుకొని, భౌతిక దాడులకు దిగారు. పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించి, పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఏకగ్రీవాల ప్రక్రియపై సమగ్ర విచారణ జరిగితే అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఎన్నికల రికార్డులు, అభ్యర్థుల ఫిర్యాదులు, నామినేషన్ల స్వీకరణ వివరాలను పరిశీలిస్తేనే అసలు పరిస్థితి స్పష్టమవుతుంది. బహిష్కరణకు కారణమిదే.. నరసరావుపేట నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ సభ్యులకు తగిన రక్షణ కల్పించలేదని, ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజాస్వామ్య హక్కు. ఆ హక్కును వినియోగించుకునే పరిస్థితులు లేవని ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత బహిరంగంగా ప్రకటించాల్సి రావడం ఎన్నికల నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ అల్లరిమూకలు గుంపులుగా చేరి నామినేషన్లను అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి... కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. రక్షణ కల్పించలేమని స్వయంగా డీఎస్పీనే చేతులెత్తేశారు. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గోపిరెడ్డి ప్రకటించారు. జాతీయ స్థాయిలోనూ చర్చ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై జాతీయ మీడియా, జాతీయ స్థాయి రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అడ్డంకులు, దాడులు, నిర్బంధాల తీరును ఎండగట్టారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ జరిగిన ఎన్నికలు ప్రజాతీర్పు కాదని అభివర్ణించారు. ప్రత్యర్థిని అడ్డుకొని సంబరాలా? జిల్లాలో భారీ సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. నామినేషన్ల సమయంలో ప్రతిపక్షాన్ని అడ్డుకొని, అడ్డదారిలో గెలుపొంది విజయకేతనాలు ఎగురవేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలే తమకు పట్టం కట్టారని చెప్పుకోవాలంటే, వారు అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం కల్పించాలి. ప్రత్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనీయకుండా అడ్డుకొని, ఏకగ్రీవంగా గెలుపొంది, అదే ప్రజాతీర్పుగా అభివర్ణించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పఠంపై కూర్చోవడం పదవి పరంగా విజయం కావచ్చు కానీ, ఎన్నికల ప్రక్రియ ఇలా ఉంటే ఆ గెలుపునకు విలువ ఉండదు. దీనికి సంబరాలు ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది.

న్యూస్‌రీల్‌

మాజీ మంత్రి రజినిపై భౌతిక దాడి

మాజీ మంత్రి విడదల రజినిని మూడు రోజుల పాటు హౌస్‌ అరెస్టు పేరుతో నిర్బంధించి వేధింపులకు పాల్పడ్డారు. తనను కలిసేందుకు వచ్చిన పార్టీ దళిత సంఘం నేతను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న విడదల రజిని గృహం నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో మహిళా ఎస్‌ఐ లేఖాప్రియాంక ఆమెను అడ్డుకొని, దురుసుగా ప్రవర్తించడంతో పాటు భౌతిక దాడికి పాల్పడ్డారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ మెప్పు కోసం మాజీ మంత్రి అని కూడా చూడకుండా విచక్షణరహితంగా ఇలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

నామినేషన్ల దశలోనే అడ్డంకులు

నామినేషన్ల ప్రక్రియ సాగిన మూడు రోజులూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్‌ అరెస్టుల పేరుతో నిర్బంధించారు. పోటీకి సిద్ధమైన అభ్యర్థులకు అండగా నిలవాల్సిన నాయకులను నిర్బంధించడం వల్ల నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేయడానికి వెళ్లిన అభ్యర్థుల పత్రాలను పోలీసుల సమక్షంలోనే లాక్కొని చించివేశారు. ఈ చర్యలను ప్రశ్నించిన వారిపై పచ్చమూకలు భౌతిక దాడులకు దిగాయి. నామినేషన్లు దాఖలు చేయడం ప్రతి అర్హుడైన అభ్యర్థికి ఉన్న హక్కు. ఆ హక్కుకు ఎవరు అడ్డుపడినా చట్టం తన పని తాను చేయాలి. అయితే, అధికారులు పూర్తిస్థాయిలో టీడీపీ నాయకులకు కొమ్ముకాశారు.

శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

నరసరావుపేట గడియారస్తంభం సెంటర్‌లో గుమికూడిన టీడీపీ మూకలు (ఫైల్‌)

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి

టీడీపీ గెలుపు సంబరాలు

అక్రమ అరెస్టులతో ఇతర పార్టీల

నామినేషన్లకు అడ్డుకట్ట

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ

ఇన్‌చార్జుల హౌస్‌ అరెస్టులు

జిల్లాలో 419 ఎంపీటీసీ స్థానాలకు 378 కూటమికి ఏకగ్రీవం

28 జెడ్పీటీసీ స్థానాల్లో 18 వారికే..

దీనిని ప్రజాతీర్పుగా టీడీపీ

చెప్పుకోవడంపై సర్వత్రా విస్మయం

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పల్నాడు జిల్లాలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలపై విజయోత్సవాలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఏకగ్రీవం కావడం ఒకటి.. పోటీకి అవకాశం లేకుండా ఏకగ్రీవం కావడం మరొకటి. రెండో తరహాలో టీడీపీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్నికల వేళ టీడీపీ గూండాలు బరితెగించి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. నేడు ఏకగ్రీవంగా పచ్చ అభ్యర్థులు గెలుపొందారు. అదే ప్రజాతీర్పుగా సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement