జిల్లా జట్టు ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా జట్టు ఎంపిక పోటీలు

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

బాస్కెట్‌బాల్‌ ఉమ్మడి గుంటూరు

నరసరావుపేట ఈస్ట్‌: స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బాస్కెట్‌బాల్‌ ఉమ్మడి గుంటూరు జిల్లా బాలబాలికల జట్టు ఎంపిక పోటీలు మంగళవారం కే–రిడ్జి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ క్రీడా మైదానంలో నిర్వహించారు. బాస్కెట్‌బాల్‌ అండర్‌–14, అండర్‌–17 బాలబాలికల పోటీలను పాఠశాల చైర్మన్‌ నాతాని వెంకటేశ్వర్లు, డైరెక్టర్‌ కోమటినేని నాసరయ్య ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి దాదాపు 220 మంది హాజరయ్యారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు అండర్‌–14 జట్టు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోనూ, అండర్‌– 17 జట్టు కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని శాప్‌ కోచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ జి.బర్నబాస్‌, అకడమిక్‌ సీఈఎ విజయరాజు, క్యాంపస్‌ ఇన్‌చార్జి కోట బాపూజీ, స్కూల్‌గేమ్స్‌ ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, ఎం.భాగ్యలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement