స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్‌

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

వినుకొండ: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని లయోలా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా మంగళవారం పరిశీలించారు. పాఠశాలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్షించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్‌ 1వ తేదీన ఎన్నికలు పూర్తయిన వెంటనే, బ్యాలెట్‌ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించాలని ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌ శివరామ్‌ ప్రసాద్‌, తహసీల్దార్‌ సురేష్‌నాయక్‌లకు ఎన్నికల నిర్వహణ, భద్రతపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

దాడి కేసులో నలుగురికి జైలు

నరసరావుపేట టౌన్‌: దాడి కేసులో నేరం రుజువు అవ్వటంతో నలుగురు నిందితులకు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో 2023 డిసెంబర్‌ 25న తన అన్న కుమారులైన షేక్‌ యాసిన్‌ బాషా, హఫీజ్‌ బాషా, ఫరీద్‌ బాషా, మహబూబ్‌ సుభానిలు తనపై దాడి చేసినట్లు షేక్‌ రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న టూటౌన్‌ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు.

రాజధానిలో ఎంపీలు పర్యటన

తాడికొండ: రాజధాని అమరావతిలో పార్లమెంట్‌ సభ్యులు ఉజ్వల్‌ రమన్‌ సింగ్‌ (ప్రయాగ్‌రాజ్‌, యూపీ), హరిభాయ్‌ (పటేల్‌ మహాసేన, గుజరాత్‌) మంగళవారం పర్యటించారు. రాయపూడిలోని ఏపీ సీఆర్డీయే ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఇరువురు పార్లమెంట్‌ సభ్యులకు ఏపీ సీఆర్డీయే అడిషనల్‌ కమిషనర్లు ఏ భార్గవతేజ, కొల్లాబత్తుల కార్తీక్‌ స్వాగతం పలికారు. అనంతరం ఏపీ సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలోని అమరావతి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో అమరావతి విజన్‌, విస్తృత నగర ప్రణాళిక, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీలకు వివరించారు.

విజ్ఞాన్‌లో ‘బయోమెడ్‌–26

వర్క్‌షాప్‌, హ్యాకథాన్‌’ ప్రారంభం

చేబ్రోలు: బయోమెడికల్‌ డేటా విశ్లేషణలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వైద్య పరిశోధనల్లో నూతన అవకాశాలను సృష్టిస్తోందని ఐఐటీ గువాహటి బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకట దాసు వీరంకి ేతెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్‌, హ్యాకథాన్‌ ‘ఏఐ4 బయోమెడ్‌–26’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ‘బయోమెడికల్‌ డేటా కోసం కృత్రిమ మేధస్సు’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ప్రాయోగిక శిక్షణతోపాటు రెండు రోజుల బయో–ఏఐ హ్యాకథాన్‌ను ఇందులో భాగంగా ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన డాక్టర్‌ వెంకట దాసు వీరంకి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, డేటా సైన్స్‌, కృత్రిమ మేధస్సు పరస్పరం అనుసంధానమై వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. విద్యార్థులు కేవలం సైద్ధాంతిక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, వాస్తవ సమస్యలను గుర్తించి సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement