వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం

నకరికల్లు: సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో మూడు ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నకరికల్లు మండలం గుండ్లపల్లి –1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అలుగుమల్లి సీతారావమ్మ ఏకగ్రీవమయ్యారు. దేచవరం గ్రామం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి వేముల రామాంజమ్మ ఏకగ్రీవమయ్యారు. దేచవరం ఎంపీటీసీ స్థానం ఓసీ మహిళకు రిజర్వేషన్‌ రాగా ఆ స్థానంలో బీసీ మహిళకు వైఎస్సార్‌ సీపీ తరఫున అవకాశం కల్పించారు. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకుగాను తొమ్మిది స్థానాలలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను టీడీపీ గూండాలు భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్‌ వేసిన తొమ్మిది స్థానాల్లో కుంకలగుంట–1, కుంకులకుంట –2 స్థానాల్లో అభ్యర్థులను ప్రతిపాదించిన వ్యక్తులు పోటీ చేసిన స్థానాలకు సంబంధించిన వారు కాకపోవటంతో నామినేషన్లు చెల్లుబాటు కాలేదు. మరో ఐదుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి తీసుకొని రావడం, భయభ్రాంతులకు గురి చేయడంతో నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. దేచవరం, గుండ్లపల్లి–1 స్థానాలు వైఎస్సార్‌ సీపీకి ఏకగ్రీవమయ్యాయి. కుంకలగుంట–1 స్థానంలో టీడీపీ అభ్యర్థిపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి పోటీ ఉండడంతో ఆ ఒక్క స్థానానికి ఎన్నిక అనివార్యమైంది.

ముప్పాళ్ల: ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామం ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్‌లో భాగంగా ఎంపీటీసీ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయించారు. అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ తరుపున మలిరెడ్డి బ్రహ్మారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్‌ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు నామినేషన్‌లు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. తనపై నమ్మకముంచి ఎంపీటీసీ స్థానం కేటాయించిన వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డికి, వైఎస్సార్‌సీపీ పార్టీ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మలిరెడ్డి

బ్రహ్మారెడ్డి

వేముల రామాంజమ్మ, దేచవరం

అలుగుమల్లి సీతారావమ్మ, గుండ్లపల్లి –1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement