ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి

నరసరావుపేట: తుపాను నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు దెబ్బతినే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే స్పందించి, సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్‌న్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెగిపడిన విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్‌ పరికరాలు, స్తంభాల సమీపానికి వెళ్లవద్దని, ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు, తెగిపడిన తీగలు, ఇతర విద్యుత్‌ ప్రమాదాలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే అత్యవసర సహాయం కోసం పల్నాడు జిల్లాలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్‌ నంబరు 7661019447ను సంప్రదించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎండీ అధికారులకు సూచించారు.

మద్యం అక్రమ విక్రయాల కేసులో ఒకరు అరెస్ట్‌

సత్తెనపల్లి: అక్రమ మద్యం విక్రయాల్లో ఒకరిని అరెస్టు చేయగా, ఎనిమిది మందిని బైండోవర్‌ చేసినట్టు ప్రొహిబీషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సత్తెనపల్లి సీఐ పీ విజయకుమార్‌ మంగళవారం తెలిపారు. సత్తెనపల్లి మండలానికి చెందిన ముగ్గురు, ముప్పాళ్ల మండలానికి చెందిన ముగ్గురు,రాజుపాలెం మండలానికి చెందిన ఇద్దరిని మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచి, ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ఏడాది కాలానికి సత్ప్రవర్తన కోసం బైండోవర్‌ చేశామన్నారు. ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో నిర్వహించిన దాడిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒకరిని అరెస్ట్‌ చేసి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఆయనతోపాటు సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.

సోమసుందరపాలెంలో మరొకరు...

తెనాలిరూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.నయనతార ఆధ్వర్యంలో కాంటినెంటల్‌ కాఫీ లిమిటెడ్‌లో మిథనాల్‌ ఉపయోగించే విధానాన్ని పరిశీలించారు. దుగ్గిరాల మండలంలోని చిలువూరు, దుగ్గిరాల వైన్‌ షాపులలో మద్యం విక్రయాలను ఏపీ సురక్ష యాప్‌ ద్వారా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా తెనాలి మండల పరిధిలోని సోమసుందరపాలెంలో మద్యం అక్రమ నిల్వలు కలిగి ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. తనిఖీలలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement