ఆగి గుండెల్లో మోగిన స్వరం | - | Sakshi
Sakshi News home page

ఆగి గుండెల్లో మోగిన స్వరం

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

వినుకొండ టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్‌ ఏఐ రూపంలో ప్రజల ముందుకొచ్చిన రషీద్‌ మాటలు తన తల్లి షంషాద్‌ను కౌన్సిలర్‌గా గెలిపించాలని విజ్ఞప్తి కొడుకును కోల్పోయిన తల్లి కన్నీటి పోరాటానికి ప్రజల మద్దతు కోరుతూ సందేశం రషీద్‌ మాటలతో నాడు టీడీపీ నేతల అరాచకత్వాన్ని గుర్తుచేసుకుంటున్న ప్రజలు ప్రతి గుండెను తాకిన రషీద్‌ మాటలు వినుకొండలో పాత ఘటనను గుర్తుచేసిన ఏఐ వీడియో

జ్ఞాపకాల నుంచి

ఎన్నికల బరిలోకి..

నరసరావుపేట టౌన్‌: కాలం గడిచినా కొన్ని గాయాలు మానవు.. మనిషి దూరమైనా అతడి జ్ఞాపకాలు చెరిగిపోవు.. గుండెల్లో గూడు కట్టుకున్న ఆత్మీయుడి స్వరం మళ్లీ వినిపిస్తే ఆ వేదన వర్ణనాతీతం. వినుకొండ పట్టణ నడిబొడ్డులో 2024 జూలై 17న రషీద్‌ను టీడీపీ గూండాలు అతి ధారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య ఘటనను గుర్తుచేస్తూ, ఏఐ సాంకేతికతతో రూపొందించిన వీడియో ఇప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వినుకొండ వైఎస్సార్‌సీపీ 28వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటిచేస్తున్న తన తల్లి షంషాద్‌కు అండగా నిలవాలని, ఆమెను గెలిపించాలని రషీద్‌ మాట్లాడుతున్నట్లుగా రూపొందించిన ఏఐ వీడియో పలువురిని భావోద్వేగానికి గురిచేసింది.

గతాన్ని గుర్తుచేసిన ఘటన..

రషీద్‌ హత్య ఘటన నాటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ అతడి కుటుంబం చేస్తున్న రాజకీయ పోరాటం మరోసారి చర్చకు వచ్చింది. కొడుకును కోల్పో యిన తల్లి షంషాద్‌ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. బిడ్డను కోల్పోయిన బాధను దిగమింగుకుంటూ ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకు ప్రజలు అండగా నిలవాలనే సందేశంతో ఏఐ వీడియోను రూపొందించారు.

అమ్మకు అండగా నిలవండి..

వీడియోలో రషీద్‌ మాట్లాడుతున్నట్లుగా రూపొందించిన సందేశం భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది. తాను భౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా, తన జ్ఞాపకాలు మాత్రం వారితోనే ఉంటాయని చెబుతున్నట్లుగా వీడియో సాగింది. తన తల్లికి కొడుకు లేడనే లోటు రానివ్వకుండా ఆమెకు తోడుగా నిలవాలని, షంషాద్‌కు తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నట్లుగా సందేశాన్ని రూపొందించారు. అదేవిధంగా మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన చైర్మన్‌ అభ్యర్థి పీఎస్‌ ఖాన్‌కు విజయాన్ని అందించండి అంటూ రషీద్‌ పేర్కొన్నాడు.

ఒకవైపు కొడుకును కోల్పోయిన తల్లి ఆవేదన.. మరోవైపు తన బిడ్డ జ్ఞాపకాలతో ఆమె చేస్తున్న రాజకీయ పోరాటం.. ఈ రెండింటినీ మేళవిస్తూ రూపొందించిన ఏఐ వీడియో వినుకొండలో చర్చకు దారితీసింది. నాడు జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటున్న ప్రజలు, నేటి రాజకీయ పరిణామాలను కూడా చర్చించుకుంటున్నారు. సాంకేతికత సాయంతో మళ్లీ వినిపించినట్లుగా రూపొందించిన రషీద్‌ స్వరం.. అతడి కుటుంబం అనుభవిస్తున్న విషాదాన్ని మరోసారి గుర్తుచేసింది. కొడుకు లేని లోటును ఎవరూ తీర్చలేకపోయినా, తన తల్లికి ప్రజలు అండగా నిలవాలనే సందేశం వీడియోలో ప్రధానంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement