ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

రెంటచింతల: రెంటచింతలలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం తెల్లవారుజామూన జరిగింది. గ్రామానికి చెందిన అనంతవరపు గోవర్ధనాచారి(51) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మొదటి భార్య వెంకాయమ్మ 2011 సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందగా 2012 సంవత్సరంలో రాజేశ్వరిని రెండవ వివాహం చేసుకు న్నాడు. కార్పెంటర్‌ పనిచేస్తూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పల్నాడు జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్‌గా కొనసాగుతున్నాడు. దసరా సందర్భంగా భార్య రాజేశ్వరి కుమార్తెతో కలిసి గురజాల పట్టణం వెళ్లారు. తాను మాత్రమే రెంటచింతలకు తిరిగి రాగా భార్య, కుమార్తె గురజాలలోనే ఉన్నారు. గోవర్ధనాచారి వద్ద నున్న తన ద్విచక్రవాహనం తీసుకునేందుకు అతని స్నేహితుడు ఈశ్వరాచారి ఇంటికి వచ్చే సరికి గోవర్ధనాచారి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. అనారోగ్య సమస్యతోనే గోవర్ధనాచారి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భార్య, ఆయన బంధువులు తెలిపారు. మృతుడికి తొలి భార్య సంతానం ఒక కుమార్తె కాగా రెండో భార్యకు మరో కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున ఘటన స్థలానికి చేరుకుని మృతుడి భార్యను వారి బంధువులను ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంచనామా నిమిత్తం మృతుడిని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement