కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

అచ్చంపేట: కృష్ణానదిలో ఈత కొట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కస్తలలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పిడుగురాళ్ల మండలం కొండమోడుకు చెందిన మురికిపూడి జక్రయ్య(42) గ్రామాలు తిరిగి గేదెల, ఎద్దులు కొనుగోలు, విక్రయాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మరో నలుగురు కామినేని వెంకటేశు, మేడా యాకోబు, చల్లా కొండలు, గాలి చిన్న బసవయ్యలతో కలసి ఆదివారం సాయంత్రం కస్తల గ్రామానికి వచ్చాడు. సమీపంలోని కృష్ణానదిని సందర్శించడానికి వెళ్లి అక్కడ ఈతకొట్టేందుకు అందరూ నదిలో దిగారు. స్నానాలు చేస్తుండగా జక్రయ్య కనిపించకపోవడంతో మిగిలిన వారంతా ఆందోళనకు గురై వెతికారు. కనిపించకపోవడంతో గ్రామ వీఆర్యే షేక్‌ మీరా సాహెబ్‌ ద్వారా అచ్చంపేట పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు, స్థానికులు కలసి జక్రయ్య కోసం రాత్రి 9గంటల వరకు తీవ్రంగా గాలింపు చేపట్టారు. జక్రయ్య ఆచూకీ కనిపించకపోవడంతో సోమవారం ఉదయాన్నే చేపల పడవల ద్వారా ఈతగాళ్లు గాలించారు. జక్రయ్య గల్లంతైన ప్రాంతానికి కొద్దిదూరంలో ఉన్న ఒక టవర్‌ వద్ద నదిలో తేలుతూ కనిపించిన మృతదేహాన్ని బయటకు తీశారు. అచ్చంపేట సీఐ ఆవుల హరిబాబు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి తండ్రి దేవదాసు, భార్య మరియమ్మ, కుమారులు సుధాకర్‌, అభిలాష్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement