మాజీ మంత్రి ఇంట అడిషనల్‌ ఎస్పీ విచారణ | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి ఇంట అడిషనల్‌ ఎస్పీ విచారణ

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

చిలకలూరిపేట: మాజీ మంత్రి విడదల రజిని పట్ల రూరల్‌ ఎస్‌ఐ లేఖా ప్రియాంక దురుసుగా వ్యవహరించి, తోసి పడవేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పందించి సంబంధిత రూరల్‌ ఎస్‌ఐ లేఖా ప్రియాంకపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎన్నికల విధులతోపాటు అన్ని రకాల విధుల నుంచి తప్పించారు. ఈ విషయమై సోమవారం జిల్లా అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి, దిశ డీఎస్పీ ఎం బుచ్చిరాజు, పోలీసు అధికారులతో కూడిన బృందం చిలకలూరిపేటలోని మాజీ మంత్రి విడదల రజిని నివాసానికి వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. సంఘటన జరిగిన తీరు గురించి మాజీ మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీకి జరిగిన సంఘటనల గురించి మాజీ మంత్రి విడదల రజిని వివరించారు. అప్పటికే సంబంధిత ఎస్‌ఐ మూడు రోజుల నుంచి అతిగా ప్రవర్తిస్తూ ఇంటికి వచ్చిన వారి పట్ల దురుసుగా వ్యవహరించారని తెలిపారు. కార్యక్రమంలో అర్బన్‌ సీఐ పి రమేష్‌, పట్టణ ఎస్‌ఐ పి హజరతయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement