నరసరావుపేటరూరల్:రామాయణ మహాకావ్యా న్ని రచించి, భారతీయ సంస్కృతి, ధర్మం, నైతిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహార్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి అన్నారు. మహార్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటం వద్ద జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ వాల్మీకి మహర్షి బోధనలు సమాజంలో సత్యం, ధర్మం, మానవతా విలువలను పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని తెలిపా రు. వాల్మీకి మహర్షి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి, ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి పాల్గొన్నారు.
కరాటే, యోగా పోటీలకు ఎంపికలు
ఈపూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–14, 17 బాలురు, బాలికల కరాటే, యోగ స్కూల్ గేమ్స్ ఎంపికలు మండలంలోని బొగ్గరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు మీనగ రామారావు తెలిపారు. పోటీలను స్కూల్ గేమ్స్ సెక్రటరీ లాకు పిచ్చయ్య ప్రారంభించారు. పోటీలలో అండర్ 17 కరాటే బాలురు, బాలికల విభాగాలలో ఎం.జితేంద్ర, కె.సంపత్, ఎం వరుణ్‌కుమార్, ఎల్ శశి కళ్యాణ్, ఎం రజిత, ఎం హేమశ్రీ, ఆర్ దుర్గాబాయి, పి కీర్తితోపాటు మరి కొంతమంది విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్– 14 కరాటే బాలికల విభాగంలో కె త్రివేణి(26 కేజీ), బి.తేజ సాయి(30కేజీ), ఎం.మోక్షిత (34కేజీ), ఎన్ నిధి (38 కేజీ)తోపాటు మరికొంతమంది విద్యార్థు లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
రైలు కింద పడి యువకుడు మృతి
రాజుపాలెం: రైలు కింద పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని అనుపాలెం సమీపంలో రైల్యే ట్రాక్‌పై సోమవా రం జరిగింది. మృతు డు మాచవరం మండ లం తురకపాలెం గ్రామానికి చెందిన షేక్ జాఫర్(35)గా రైల్యే పోలీసులు గుర్తించారు. జాఫర్ గతంలో పలు పత్రికల్లో విలేకరిగా పని చేశారు. ప్రస్తుతం మాచవరంలో బైక్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నారు. ఆదివారం పిడుగురాళ్లలో తోటి స్నేహితులతోను, విలేకర్లతోను సాయంత్రం వరకు సరదాగా గడిపినట్లు తెలుస్తుంది. రాత్రి సమయంలో రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్యే కీమెన్ ద్వారా తెలిసినట్లు నడికూడి రైల్యే ఇన్‌ఛార్జి ఎస్‌ఐ రాజమోహన్ తెలిపారు. రైల్యే ఎస్‌ఐ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు జాఫర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
శ్రీనగర్‌కాలనీ: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన రమేష్ గుప్తా(35) ఆదిలాబాద్‌కు చెందిన ఇద్దరు, నరరావుపేటకు చెందిన యువకుడితో కలిసి సినీ కార్మికుడిగా పనిచేస్తూ యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో నాలుగో అంతస్తులో పెంట్‌హౌస్‌లో నివసిస్తున్నారు. సోమవారం పెంట్‌హౌస్ నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ మధురానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తలుపు తెరిచిచూసే సరికి రమేష్ మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. కొన్నిరోజుల క్రితమే చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. రమేష్ స్నేహితులు ముగ్గురూ కొన్ని రోజులుగా కనిపించకుండా పరారీలో ఉన్నారు. హత్య చేసి పారిపోయారా లేక రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే అంశాలపై క్లూస్‌టీంతో విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలాన్ని జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణారెడ్డి, ఏసీపీ వెంకటరెడ్డి, ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ పరిశీలించి విచారణను విస్తృతం చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి
సత్తెనపల్లి: రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై సోమవారం గుర్తించారు. యువ కుని వయసు 35 సంవత్సరాలు ఉంటుందని, రైలు కింద తలపెట్టి మృతి చెందగా మృత దేహం తలభాగం ఛిద్రమై, కుడికాలు, మడమ భాగం ఛిద్రమైనట్టు గుర్తించారు. రైల్వే పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


