టీడీపీ ఫేకాట! | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ఫేకాట!

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

జిల్లాలో ఫేక్‌ నామినేషన్లు.. బెదిరింపులు.. రాయబేరాలు నామివేషాలు!

బరిలో నిలిచే బలమైన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై జులుం టీడీపీ పెద్దలతో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఫోన్‌లు తాయిలాలు ఇచ్చేందుకు సైతం సై అంటున్న వైనం ఇప్పటికే ఆయా చోట్ల పెద్ద ఎత్తున ఫేక్‌ నామినేషన్లు దాఖలు ఓటమి భయంతోనే కూటమి కుటిల రాజకీయాలు టీడీపీ అరాచకాలను అసహ్యించుకుంటున్న ప్రజలు

ఓటమి

భయంతోనే..

జిల్లాలో ఫేక్‌ నామినేషన్లు.. బెదిరింపులు.. రాయబేరాలు
నామివేషాలు!

సత్తెనపల్లి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల పురపాలక సంఘాల్లో అభ్యర్థులు ఖరారు కావడం, ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుండడంతో ప్రలోభాలు, బుజ్జగింపులు, బెదిరింపుల పర్వం తారాస్థాయికి చేరింది. నాలుగు పురపాలక సంఘాల్లో నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఖరారయ్యారు. మొత్తం 156 వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు గాను 17 వార్డు కౌన్సిలర్‌ స్థానాలు దొడ్డి దారిన కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసి ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన 139 వార్డులకు గాను వైఎస్సార్‌ సీపీ నుంచి 102 మంది, టీడీపీ నుంచి 115 మంది, జనసేన నుంచి 18 మంది, బీజేపీ నుంచి ఆరుగురు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరు కాక స్వతంత్రులు సైతం పోటీలో ఉన్నారు. కూటమి అభ్యర్థులు ఓటమిపాలవుతామనే వార్డుల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నుంచి నగదు తీసుకొని పోటీ నుంచి తప్పుకోవాలని ప్రలోభాలకు గురి చేస్తూ బుజ్జగించడం, కాదంటే కేసులు నమోదు చేయిస్తామనే హెచ్చరికలు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారు.

తప్పుకోవాలంటూ బెదిరింపులు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీకి చెందిన ఓ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిని కూటమినేతలు పిలిచి పోటీ నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందే చెబితే తప్పుకొనేవాడినని, ఇప్పుడు అంతా పూర్త య్యాక తప్పుకోమంటే పార్టీలో పరువు పోతుందని చెప్పటంతో ... నీ ఇష్టం ఆలో చించుకో, నువ్వు గృహ నిర్మాణాలు చేశావంట దానిలో నీపై ఆరోపణలు ఉన్నాయి. అది బయటకు తీయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినప్పటికీ తప్పుకోలేనని, మీకు దయ ఉన్నట్లు చేయండని చెప్పటంతో నీపై గంజాయి కేసులు నమోదు చేయిస్తామంటూ హెచ్చరించిన విషయం కూటమి పార్టీకి చెందిన నేతలే ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరో వార్డు మహిళా కౌన్సిలర్‌ అభ్యర్ధినికి రూ. 9 లక్షలు ఇస్తాం తప్పుకోమని ద్వితీయ శ్రేణి నాయకులు ఆఫర్‌ పెట్టగా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆమె రూ. 9 లక్షలకు మరో రూ.లక్ష కలిపి ఇస్తాను అధికారి పార్టీ నుంచి తప్పుకోమని ధీటుగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇవే కాదు మరో వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిని నువ్వు ప్రచారం చేయటానికి వీలులేదని, బెదిరింపులకు గురి చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. చిలకలూరిపేటలో సాక్షాత్తు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిని ఏకంగా టీడీపీలో చేరేలా ఏ మేరకు బెదిరింపులకు గురి చేసి ఒత్తిడి తెచ్చారో తెలుస్తోంది. ఇప్పటికే దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు సైతం వెయ్యనీయకుండా ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన వారిని సైతం తప్పుకోవాలంటూ బెదిరింపులు, భయాందోళనలకు గురిచేస్తున్నారు.

విష సంస్కృతికి బీజం...

ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న క్రమంలో పోటీదారులను తప్పించే ప్రయత్నాలు, బెదిరింపులకు శ్రీకారం చుట్టడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈతరహా రాజకీయాలు గతంలో ఎన్నడూ లేవు. ఇటువంటివి ఈ రెండున్నరేళ్ల కాలంలో శృతిమించాయి. అధికార పార్టీ నేతల చర్యల్లో ఏ ఒక్కటీ ప్రజలు స్వీకరించలేక పోతున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు ఎన్నికల్లో పోటీ లేకుండా చేసుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు సాగుతుండడాన్ని జిల్లా వాసులు యావగించుకుంటున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నట్లుగా అధికార పార్టీ నేతల వైఖరి ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

ఓవైపు నామినేషన్లు వేయనివ్వకుండా, మరోవైపు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు దాఖలు చేసినట్లు టీడీపీ అభ్యర్థులే ఫేక్‌ నామినేషన్లు వేయడం, ఇంకో వైపు నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవాలని, పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేయడం చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులు ఓటమి పాలవుతామనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ తరఫున బలమైన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటే తమకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు శ్రీకారం చుట్టారనే బలమైన విమర్శలు ఉన్నాయి. బుజ్జగింపులకు, ప్రలోభాలకు, బెదిరింపులకు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ కి చెందిన ఎక్కువ మంది అభ్యర్థులు ఎవరూ భయపడకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయి ప్రస్తుతం ఉపసంహరణ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ బెదిరింపులు, బుజ్జగింపులు వేగవంతం చేశారు. పోలీసుల చేత బెదిరించటం, వినకపోతే అదుపులోకి తీసుకొని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈక్రమంలోనే నకరికల్లు జడ్పీటీసీ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావటంతో దేచవరం గ్రామానికి చెందిన కందుల హనుమాయమ్మ వైఎస్సార్‌ సీపీ నుంచి నామినేషన్‌ దాఖలు చేసింది. ప్రత్యర్ధిగా డాక్టర్‌ నాగౌతు వెంకటలక్ష్మీ సరోజ కూటమి నుంచి నామినేషన్‌ దాఖలు చేసింది. ఆమెను ఏకగ్రీవం చేసేందుకు హనుమాయమ్మను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు. వినకపోవడంతో హనుమాయమ్మ భర్త లక్ష్మారెడ్డిని ఆదివారం అర్ధరాత్రి నకరికల్లు ఎస్‌ఐ సతీష్‌, పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం తెల్లవారు జామున వదిలిపెట్టారు. జెడ్పీటీసీగా దాఖలు చేసిన నామినేషన్‌ ఉపసంహరణ చేసుకోవాలని బెదిరింపులకు గురిచేశారనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement