అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన | - | Sakshi
Sakshi News home page

అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన ఆరవ బెటాలియన్‌లో వాల్మీకి జయంతి 1న సీనియర్‌ బాలికల సాఫ్ట్‌బాల్‌ సెలక్షన్స్‌

అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయంలో సోమవారం లోక కల్యాణార్ధం లక్షబిల్వార్చన అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటుగా గణపతి, రుద్రహోమం నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణానంతరం సహస్ర నామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. బాలచాముండేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో తుపాను కంట్రోల్‌ రూమ్‌

నరసరావుపేట: అర్నబ్‌ తుపాను కారణంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, తక్షణ సహాయక చర్యలు అందించేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలూ పనిచేస్తోందని, ప్రజలకు అవసరమైన సమాచారా న్ని అందించడంతోపాటు, సహాయక చర్య లను సమన్వయం చేయడానికి సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 08647– 252999 నెంబరును సంప్రదించవచ్చన్నారు.

మంగళగిరి టౌన్‌: వాల్మీకి జయంతిని పురస్కరించుకుని సోమవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌లో వేడుకలు నిర్వహించారు. ఆరవ బెటాలియన్‌ కమాండెంట్‌ ఎ.మురళి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహర్షి వాల్మీకి జీవితాన్ని, ఆయన అందించిన సాహిత్య సేవలను స్మరించుకున్నారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సాహిత్యానికి అపారమైన కీర్తిని తీసుకొచ్చిన వాల్మీకి మహర్షి ఆదికవిగా ప్రసిద్ధి చెందారని గుర్తు చేసుకున్నారు. ఆయన రచనలు సమాజానికి నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవనం, సత్యనిష్ఠ, మానవతా దృక్పథం వంటి గొప్ప సందేశాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి జీవితం, ఆయన సాహిత్యం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో మంచి విలువలను పెంపొందించుకోవాలని సూచించారు.

రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నవంబర్‌ 1న ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్‌ బాలికల (మహిళలు) సాఫ్ట్‌బాల్‌ సెలక్షన్‌న్స్‌ జరుగుతాయని ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌ బాల్‌ సెక్రటరీ పి.సామంత్‌ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సీనియర్‌ బాలికల సెలక్షన్స్‌లో పాల్గొనే వారికి వయస్సుతో సంబంధం లేదన్నారు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనే వారు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డులు తీసుకుని రావాలన్నారు. ఈ సెలక్షన్‌న్స్‌లో ఎంపికై న వారు డిసెంబర్‌లో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. పూర్తి వివరములకు 9666723772 నంబర్‌కు కాల్‌ చేయాలని ఆయన కోరారు.

కొండవీడు కోటకు నో ఎంట్రీ

నేటి నుంచి 29 వరకు చెక్‌పోస్ట్‌ మూసివేత

యడ్లపాడు: తుపాను ప్రభావం నేపథ్యంలో పర్యాటక ప్రాంతమైన కొండవీడు కోట సందర్శనకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొండవీడు ఫోర్ట్‌ చెక్‌పోస్ట్‌ను మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం నుంచి ఈనెల 29 వరకు పర్యాటకులకు అనుమతి నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. తుపాను ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు, ప్రజలు ఈ మూడు రోజులూ కొండవీడు కోట సందర్శనకు రావద్దని అధికారులు సూచించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చెక్‌పోస్ట్‌ మూసివేత అమల్లో ఉన్న రోజుల్లో పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement