పకడ్బందీగా మున్సిపల్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా మున్సిపల్‌ ఎన్నికలు

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు బాధ్యతగా విధులు నిర్వహిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కన్నబాబు పేర్కొన్నారు. ఎన్నికల మెటీరియల్‌ పంపిణీ, రిసెప్షన్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లా, జిల్లా ఎస్‌పీ జగదీష్‌ అదహళ్లిలతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వెబ్‌ క్యాస్టింగ్‌కు సంబంధించి క్రిటికల్‌ పోలీస్‌స్టేషన్లలో వెబ్‌ క్యాస్టింగ్‌ నిర్వహించాలని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీలోని 156 వార్డులలో ఎన్నికలు జరుగుతాయన్నారు. 117 పోలింగ్‌ లొకేషన్లలోని 310 పోలింగ్‌ కేంద్రాలలో 2,28,391 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ఓటర్లకు ఫొటో ఓటర్‌ స్లిప్‌లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బ్యాలెట్‌ బాక్స్‌లను ఎలాంటి పొరపాట్లు జరగకుండా పోలింగ్‌ కోసం సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎస్‌పీ మాట్లాడుతూ జిల్లాలోని 117 పోలింగ్‌ లొకేషన్స్‌లో 29 హైపర్‌ సెన్సిటివ్‌ లొకేషన్స్‌, 52 సెన్సిటివ్‌ లొకేషన్స్‌, 36 నార్మల్‌ లొకేషన్స్‌ గుర్తించడం జరిగిందని తెలిపారు. హైపర్‌ సెన్సిటివ్‌ లొకేషన్స్‌లో ఐదుగురు పోలీస్‌ సిబ్బందిని, సెన్సిటివ్‌ లొకేషన్స్‌లో నలుగురు , నార్మల్‌ లొకేషన్‌లలో ఇద్దరిని నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్ట్రాంగ్‌ రూము ల దగ్గర పటిష్టమైన భద్రత కల్పిస్తామన్నారు.

ఎన్నికల అధికారులతో స్థానిక సంస్థల జనరల్‌ అబ్జర్వర్‌, కలెక్టర్‌, ఎస్పీల సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement