నూజెండ్ల: వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్న టీడీపీ సరికొత్త ఎత్తుగడకు తెరతీసింది. తమ పార్టీకి చెందిన వారితోనే వైఎస్సార్ సీపీ పేరుతో నామినేషన్లు దాఖలు చేయించింది. పమిడిపాడు ఎంసీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అధిష్టానం నుంచి బీ ఫారం పొందిన మేకల విజయ నామినేషన్ పత్రాలు దౌర్జన్యం చేసి ఆర్వో కేంద్రం వద్ద చించివేశారు. ఇదే విషయాన్ని బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల అధికారి రామ్‌బాలాజీరెడ్డిని నామినేషన్ స్వీకరణపై కలెక్టర్ ఆదేశాలు వెలువరించారు. అధికారులు ఉరుకులు పరుగులతో అభ్యర్థిని సంప్రదించగా అప్పటికే ఆమె వెళ్లిపోయారు. ప్రత్యామ్నాయంగా స్థానిక నాయకుల సహకారంతో అధికారులే అదే గ్రామానికి చెందిన టీడీపీ మహిళతో వైఎస్సార్ సీపీ పేరుతో డమ్మీ నామినేషన్ వేయించటం విశేషం. చింతలచెరువు నుంచి మొగలాబి అనే మహిళదీ ఇదే పరిస్థితి. వైఎస్సార్ సీపీ పేరుతో నామినేషన్ వేస్తున్న అభ్యర్థులంతా టీడీపీ వారేనని పమిడిపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు బత్తుల బాబు ఆరోపించారు.
సాక్షి నెట్‌వర్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ గురజాల నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో నామినేషన్ల వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అసలైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల వెనుక కూటమి నాయకుల వ్యూహం ఉందనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అసలైన అభ్యర్థులకు అడ్డంకులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయడానికి సిద్ధమైన అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారనికొందరిని అదుపులోకి తీసుకున్నారని వైఎస్సార్ సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆ పార్టీకిచెందిన అసలైన అభ్యర్థులు కానివారు వైఎస్సార్ సీపీ పేరుతో నామినేషన్లు దాఖలు చేశారనే ఆరోపణలు కొత్త వివాదానికి తెరలేపుతున్నాయి. అసలైన అభ్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం లేకుండా చేసి ఇతరుల ద్వారా నామినేషన్లు వేయించారనే అనుమానాలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల పరిధిలో పలు గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్ సీపీ తరుపున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు


