టీడీపీ ఫేక్‌ రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ఫేక్‌ రాజకీయాలు

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

టాస్క్‌ఫోర్స్‌: చిలకలూరిపేట మండలం మురికిపూడి–2 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా రావూవారి అజయ్‌ తొలిరోజు నామినేషన్‌ వేయగా, చివరి రోజున అదే స్థానానికి రావూవారి సుధీర్‌కుమార్‌చే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా టీడీపీ నాయకులు ముప్పసాని ఆదినారాయణ, చెన్నుపాటి నాగరాజు నేతృత్వంలో దగ్గరుండి నామినేషన్‌ను వేయించారు. సొంత అన్నదమ్ములైన వీరు మురికిపూడి గ్రామంలో కూటమి ప్రభుత్వంలోనూ అధికార పెత్తనం చెలాయిస్తున్నారు. ఇదే విధంగా టీడీపీ నేతలే తమ విధేయులచే నామినేషన్లను వేయించినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. తుర్లపాడు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ క్రియాశీలక కార్యకర్త ఊటుకూరి సుబ్రమణ్యం వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్‌ ఇందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఈరెండు మండలాల్లోని నామినేషన్ల వద్ద వైఎస్సార్‌సీపీ పోటీ అభ్యర్థుల నామినేషన్లు బలవంతంగా లాక్కొని చింపి, వారిని లోనికి రాకుండా అడ్డుకోవడంతో ఒక్క నామినేషన్‌ను కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు దాఖలు చేయలేదని ఆపార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షానికి అవకాశం కల్పించినట్లు పైకి చూపిస్తూ, క్షేత్రస్థాయిలో అడ్డంకులు సృష్టించారన్న విమర్శల నేపథ్యంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని ఇరుమండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement