దాచేపల్లి: పోలీసుల అక్రమ కేసులో అరైస్టెయిన వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కొప్పుల రవికుమార్ శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రవికుమార్ ఇంటిలో పోలీసులు అక్రమంగా మద్యం బాటిల్స్ పెట్టి, ఈనెల 16వ తేదీన రవికుమార్‌పై అక్రమంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి గురజాల జైలుకు పంపారు. న్యాయస్థానం ఆదేశాలతో జైలు నుంచి ప్రత్యేక బందోబస్తుతో ఈ నెల 18వ తేదీన చైర్మన్ అభ్యర్థిగా రవికుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై న్యాయస్థానంలో న్యాయపోరాటం చేయటంతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గురజాల సబ్‌జైలు నుంచి విడుదలైన రవికుమార్ దాచేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ, పార్టీ నేతలు కొప్పుల సాంబయ్య, మందపాటి రమేష్‌రెడ్డి, బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, షేక్ జాకీర్‌హుస్సేన్, కుందురు తిరుపతిరెడ్డి, మందపాటి వీరారెడ్డి, ఈదా వెంకటరెడ్డి, కొలా జంపాలరెడ్డి, జక్కా ఆశోక్, సంకురాత్రి వీరయ్య, తమ్మిశెట్టి రామకృష్ణా, పల్లపు హనుమంతరావు, ఉప్పుతల యల్లయ్య తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కష్టకాలంలో తనకు, కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు రవికుమార్ కృతజ్ఙతలు తెలిపారు. వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని నేతలు రవికుమార్కి భరోసా కల్పించారు.


