ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

నరసరావుపేట: పల్నాడు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. గురువారం జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌ చౌదరి, జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సంజన శ్రీహర్షతో కలిసి స్థానిక రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, రెండో రోజు కూడా ప్రశాంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించామని తెలిపారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్‌ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్‌డీఓ కె.బాలకృష్ణ పాల్గొన్నారు.

నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement