రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

శావల్యాపురం: మండలంలోని కృష్ణాపురం గ్రామ సమీపాన గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు మేరకు.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు కారులో అనంతరపురం నుంచి విజయవాడ బయలుదేరారు. నరసరావుపేట నుంచి వినుకొండ వైపు ట్రాలీ వాహనంలో ఇంటిసామానుతో బయలుదేరి వస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి యువకులు ప్రయాణిస్తున్న వాహనం ఇంటి సామగ్రి ఉన్న వాహనాన్ని అతి వేగంతో ఢీకొట్టింది. ఘటనలో వాహన డ్రైవర్‌ సురేష్‌ కుడి చేతికి, ట్రాలీ వాహనంలో ఉన్న గుండాల వెంకయ్యలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇరువురిని 108 అత్యవసర వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలానికి ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌బాబు తన సిబ్బంది చేరుకొని రోడ్డుకు అడ్డుగా ఉన్న రెండు వాహనాలను గ్రామస్తులు సహకారంతో ట్రాక్టర్‌తో తప్పించి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి.

ఆర్టీసీ బస్సు తగిలి వృద్ధుడు మృతి

సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన తాటికొండ బిక్షం (70) సోమవారం ఆర్టీసీ బస్సు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడి మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమా లేక వృద్ధుడి బిక్షం తప్పా అనేది పక్కన పెడితే .. నిత్యం రద్దీగా ఉండే సెంటర్‌లో రహదారిపైకి బస్సుషెల్టర్‌ ఏర్పాటు చేయడం, బస్సులు రోడ్డుపైనే నిలపడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ ఎలాంటి ముందుచూపు లేకుండా బస్సు షెల్టర్‌ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధుడు బిక్షం మృతితో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వృద్ధుడు మృతి కారణంగా ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వృద్ధుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలు వురు కోరుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి ప్రమాదాలు పునరావృతం కాకుండా బస్సు షెల్టర్‌ను పూర్తిగా వెనకవైపుకు తొలగింప చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement