ఆలయ హుండీ చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆలయ హుండీ చోరీ

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

యడ్లపాడు: యడ్లపాడు గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక ఎర్రచెరువు వద్ద కొలువైన శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని హుండీలోని నగదు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల కాలంలో హుండీ లెక్కింపు ప్రక్రియ జరిగిందని, ఆ తర్వాత ఈ చోరీ చేసినట్లు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి జిల్లా నుంచి క్లూస్‌టీంను పిలిపించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

యడ్లపాడు: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం రూపంలో ఓ వ్యక్తిని మృత్యువు కబళించింది. రహదారి దాటుతున్న మధ్యవయస్కుడిని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. యడ్లపాడులోని సెయింట్‌ ఆన్స్‌ కళాశాల ఎదుట 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు మృతుడి శరీరం ఛిద్రమై, గుర్తుపట్టలేని స్థితికి చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఎక్స్‌ప్రెస్‌ రహదారి దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగినా వాహనాన్ని ఆపకుండా డ్రైవర్‌ వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలిరంగు గళ్ల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. మోచేతులు, మోకాళ్లపై బొల్లి మచ్చలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

వేమూరు: స్కూటీపై అతి వేగంగా వెళుతూ కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు... వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన షేక్‌ మున్నా, షేక్‌ ఖాజావలి స్కూటీపై వేమూరు నుంచి జంపని వెళుతున్నారు. జంపని షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో సాయంత్రం 4 గంటలకు విద్యుత్‌ స్తంభాలను ఢీకొన్నారు. షేక్‌ మున్నా(30) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్‌ ఖాజావలికి తీవ్ర గాయాలయ్యా యి. 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. మృతుడు మున్నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement