కూటమిలో భగ్గుమన్న విభేదాలు... | - | Sakshi
Sakshi News home page

కూటమిలో భగ్గుమన్న విభేదాలు...

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

టీడీపీ నేతల ఒంటెత్తు పోకడలపై బీజేపీ రెబల్స్‌ తిరుగుబాటు చైర్మన్‌ పదవి కోసం పోటాపోటీగా నామినేషన్లు

వినుకొండ: వినుకొండలో అధికార తెలుగుదేశం పార్టీ ఏకపక్ష వైఖరి కూటమిలో చిచ్చు పెట్టింది. రాష్ట్రస్థాయిలో కూటమి సర్కార్‌ సాగుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ నేతల ఒంటెత్తు పోకడలపై మిత్రపక్షం బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ, కూటమి ధర్మాన్ని పక్కనపెట్టి బీజేపీ నాయకులు నేరుగా చైర్మన్‌ బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. స్థానిక పదవుల కేటాయింపులో టీడీపీ నాయకత్వం తమను విస్మరించడంపై రగిలిపోతున్న బీజేపీ శ్రేణులు తిరుగుబాటు బావుటా ఎగరవేశాయి. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా లీగల్‌ సెల్‌ కో–కన్వీనర్‌, ప్రముఖ న్యాయవాది ఎం.వి.అప్పారావు మరియు బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి మేడం రమేష్‌లు చైర్మన్‌ అభ్యర్థులుగా రెబల్స్‌ నామినేషన్లు దాఖలు చేశారు. కేవలం వీరే కాకుండా, మరోవైపు ఆర్యవైశ్య వర్గాల నుంచి కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, పలువురు బీజేపీ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయడం వినుకొండలో టీడీపీ ఆధిపత్య ధోరణికి అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement