కార్పొరేటర్, కౌన్సిలర్ పాత్ర కీలకం..
డివిజన్, వార్డులో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ,వీధిదీపాలు,తాగునీరు సరఫరా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడటం.
స్థానిక ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే పరిష్కరించడం. ప్రజలకు కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిపాలన అధికారుల మధ్య వారధిగా పనిచేయడం.
కార్పొరేషన్, మున్సిపాలిటీ ప్రతి నెలా నిర్వహించే కౌన్సిల్ సమావేశాలకు హాజరై డివిజన్, వార్డులోని సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం.
డివిజన్, వార్డు పరిధిలో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్‌సీలు, పార్కుల నిర్వ హణపై ప్రత్యేక దృష్టి పెట్టడం.
పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వంటి అంశాలను పర్యవేక్షించడం.
డివిజన్, వార్డు అభివృద్ధికి నిధులను సద్వినియోగం చేయడం. నూతన అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించడం.
స్థానిక వ్యాపారాలకు లైసెన్‌న్స్, చిన్నతరహా నిర్మాణాలకు అనుమతుల పరిశీలనలో భాగస్వామ్యం
కార్పొరేటర్, కౌన్సిలర్ 5 ఏళ్ల కాలపరిమితికి ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికవుతారు.
కార్పొరేషన్‌లో మేయర్, మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ అత్యున్నత పదవి. అయితే డివిజన్ స్థాయిలో కార్పొరేటర్, వార్డు స్థాయిలో కౌన్సిలర్ అత్యున్నత ప్రజాప్రతినిధి.
గుర్తుంచుకోండి..!
సత్తెనపల్లి: మున్సిపల్ పోరుకు షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో నామినేషన్ పత్రాల దాఖలు సందడి మొదలైంది. ఇదే సమయంలో మున్సిపాలిటీలతో పాటు నగర పంచాయతీల్లో రాజకీయ నాయకుల హడావుడి సైతం అధికమైంది. పోటీకి పార్టీ బీ–ఫారం చాలా కీలకం. దీన్ని దక్కించుకునేందుకు చైర్మన్ అభ్యర్థులు, కౌన్సిలర్ ఆశావహులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీల తరఫున ఎంత మందైనా నామినేషన్లు దాఖలు చేయొచ్చు. వీటి ఉపసంహరణ గడువు ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. వారిలో పార్టీ బీ–ఫారం ఎవరు ఇస్తే వారికి ఆ పార్టీ గుర్తు దక్కుతుంది. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి ఇతర గుర్తులు కేటాయిస్తారు.
నరసరావుపేట రూరల్: మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. మండలంలోని రావిపాడు, లింగంగుంట్ల, ఇస్సపాలెం, యల్లమంద, కేసానుపల్లి గ్రామాల్లోని కొంత ప్రాంతాన్ని నరసరావుపేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీనిపై స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో నరసరావుపేట మున్సిపాలిటీతో ఐదు గ్రామాల్లో గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. న్యాయస్థానం కేసులను కొట్టివేయడంతో తాజాగా మున్సిపాలిటి అధికారులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో విలీన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై సందిగ్దత నెలకొంది.
సత్తెనపల్లి: సాధారణంగా కార్పొరేషన్ పరిధిలో ఉండే కార్పొరేటర్, మున్సిపాలిటీ పరిధిలో ఉండే కౌన్సిలర్ అత్యంత కీలకమైన ప్రజాప్రతినిధి. వీరు తమ డివిజన్, వార్డు పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఉండే డివిజన్ల,వార్డుల నుంచి నూతనంగా ఎంపికయ్యే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల విధులు, అధికారాలు తెలుసుకుందాం.


