వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్ సమర్పణ
వినుకొండ: వినుకొండ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో ఓ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. 2026 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం దాఖలైన నామినేషన్లలో, కిరాతకంగా హత్యకు గురైన రషీద్ ఆత్మశాంతి కోసం ఆయ న తల్లి శంషాద్ వైఎస్సార్ సీపీ తరఫున దాఖలు చేసిన నామినేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తం 36 వార్డులు ఉన్న వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో శనివారం మొత్తం 50 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన వంటి ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. అయితే, ఈ ప్రక్రియ అంతటిలో శంషాద్ నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


