పరిహారం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పరిహారం పెంచాలి

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డు రైతుల డిమాండ్‌ అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం...

అమరావతి: రాజధాని అమరావతి చుట్టూ 97 గ్రామాలను కలుపుతూ 189 కిలోమీటర్లు పొడవున ప్రభుత్వం నిర్మించే అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వల్ల భూములు కోల్పయే రైతులు తమ భూములకిచ్చే పరిహారం పెంచి ఇవ్వాలని కోరుతూ శనివారం రాత్రి పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమరావతి మండలం లింగాపురం, ధరణికోట, పెదకూరపాడు మండలం బలుసుపాడు, పరసా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. సమావేశంలో ఔటర్‌ రింగ్‌రోడ్డులో రెండు మండలాలలో సుమారు వెయ్యి ఎకరాల వరకు ప్రభుత్వం భూసేకరణ ద్వారా సేకరించటానికి నిర్ణయించిన క్రమంలో తమకు చెల్లించే పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రైతులు నిర్ణయించారు. అమరావతి ఔటర్‌రింగ్‌రోడ్డు భూముల రైతుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆలపాటి వీరయ్య మాట్లాడుతూ తాము భూములు ఇవ్వటానికి వ్యతిరేకం కాదని తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి పరిహారం చెల్లించాలని తాము కోరుతున్నామన్నారు. రైతులు తమ పూర్తి జీవనాధారమైన భూములను కోల్సతున్నాడన్నారు. అమరావతి, పెదకూరపాడు మండలాలలో బహిరంగ మార్కెట్‌లో ఎకరా భూమి రూ.కోటి నుండి రూ.మూడు కోట్ల వరకు ధర పలుకుంతుందన్నారు అటువంటి భూములను తాము ఔటర్‌ రింగ్‌ రోడ్‌ కోసం త్యాగం చేస్తున్నామని ప్రభుత్వం తమ త్యాగాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వం రైతుల భాధలను దృష్టిలో ఉంచుకుని పరిహారం నిర్ణయించాలని ఔటర్‌రింగ్‌రోడ్డు రైతుల పక్షాన కోరుతున్నామన్నారు. సమావేశంలో లింగాపురం, ధరణికోట, బలుసుపాడు, పరసా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement