హైకోర్టు ఆర్డర్‌ను అమలు చేయాలి ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించిన డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన బూత్ నెంబర్ 209 మార్పిడిని తక్షణమే నిలిపివేసి యథాతధ స్థితిని కొనసాగించాలని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌అనీల్‌చంద్ర పునేఠను కలిసి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో రొంపిచర్ల మండల కేంద్రంలో 209 నెంబర్ బూతులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 786 ఓట్లు ఉంటే అందులో 650 ఓట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. వారిని పోలింగ్ రాకుండా చేసేందుకు ఈ బూత్‌ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ వారు నివాసం ఉండే ఏరియాలో పెట్టారన్నారు. దీనిపై పార్టీ తరపున హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశామని, హైకోర్టు పోలింగ్ బూత్‌లను మార్చడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమంటూ బూత్‌ను తిరిగి రీబ్యాక్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఈ కోర్టు ఆర్డర్ కాపీని స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కు అందజేసి తక్షణమే కోర్ట్ ఆర్డర్‌ని అమలు చేయమని కోరామన్నారు. దీనికి స్పందించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈ ఆర్డర్‌ను అమలు చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు.


