మనస్థాపంతో ఉరి వేసుకుని భర్త బలవన్మరణం
నరసరావుపేట టౌన్: భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరంపేట మిట్టబజారుకు చెందిన షేక్ నాగూర (35) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సురేంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకొని మృదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి వేర్వేరుగా కాపురం ఉంటున్నట్లు తెలిపారు. ఈ కారణంతో మన స్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


