న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
చెరకు మద్దతు ధర ప్రకటన
ఉయ్యూరు(కంకిపాడు): 2026–27 సీజన్‌కు చెరకు టన్ను మద్దతు ధర రూ.3,783గా శనివారం రైతు సంఘాల ప్రతినిధుల సమావేశంలో కేసీపీ యాజమాన్యం ప్రకటించింది.
కూటమి పాలనలో చీకటి రోజులు రాజ్యమేలుతున్నాయి. ప్రజల హక్కులను కాపాడాల్సిన పోలీసులే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియలో అడుగడుగునా పోలీసులు, టీడీపీ నేతలు ఆటంకాలు కల్పిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఇక పిడుగురాళ్ల పట్టణంలో వైఎస్సార్ సీపీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో నాయకులను, అభ్యర్థులను అరెస్టు చేసి, ఎక్కడికి తరలించారో కూడా పోలీసులు చెప్పని పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి సమయంలో వారిని అక్రమంగా అరెస్టు చేశారు. గురజాలలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని హౌస్ అరెస్టు పేరుతో అక్రమంగా నిర్బంధించారు. దాచేపల్లి నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను కూటమి నేతలు చించివేశారు. పిడుగురాళ్ల వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, ఆర్యవైశ్య సంఘం నేత యల్లారావుపై పోలీసులు అక్రమంగా బైండోవర్ నమోదు చేశారు.


