యరపతినేని చెప్పుచేతల్లో పోలీసు వ్యవస్థ | - | Sakshi
Sakshi News home page

యరపతినేని చెప్పుచేతల్లో పోలీసు వ్యవస్థ

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

యరపతినేని చెప్పుచేతల్లో పోలీసు వ్యవస్థ

క్యాంపు కార్యాలయంలో కాసును నిర్బంధించిన పోలీసులు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

నరసరావుపేట: గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు చెప్పుచేతల్లో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఉన్న తనను పోలీసులు హౌస్‌ అరెస్టు పేరుతో అక్రమంగా నిర్బంధించారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను నిర్వహించాల్సి ఉందన్నారు. కానీ పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తూ టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు తమ చైర్మన్‌ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. నామినేషన్‌ వేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. దీనిపై పోరాడుతున్న తమకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు తమనే హౌస్‌ అరెస్టు చేశారని అన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించి పోరాటం చేస్తామని ప్రకటించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం చివరి వరకు పోరాటం చేస్తామని అన్నారు. అక్రమ అరెస్టులతో కుంగిపోయేవాళ్లం కాదని, ప్రజాక్షేత్రంలో కూడా తేల్చుకుంటామని తెలిపారు. వారు ఏం చేసినా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గురజాలలో కొమ్మినేని వెంకటేశ్వర్లు, యెనుముల మురళీధరరెడ్డిలను అరెస్టు చేశారని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అడిగితే కేసులు పెడుతున్నారని, దీనికి ప్రతిఫలాన్ని రాబోయే రోజుల్లో అనుభవిస్తారని హెచ్చరించారు. కాగా, మహేష్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చెందిన రెండు గేట్ల వద్ద వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీసు సీఐలు, రూరల్‌ సీఐ తమ సిబ్బందితో పహారా కాస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement