వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి అక్రమ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి అక్రమ అరెస్ట్‌

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి అక్రమ అరెస్ట్‌

దాచేపల్లి: గురజాల నియోజకవర్గంలో పోలీసుల అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర పంచాయతీ చైర్మన్‌, వార్డు సభ్యులుగా పోటీ చేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కుట్రలకు తెరలేపారు. ఇందులో భాగంగా చైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. రవికుమార్‌ నివాసం ఉంటున్న కేఎస్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మద్యం సీసాలు ఉన్నాయంటూ ఆరోపిస్తూ రవికుమార్‌ను పోలీసులు జీపు ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆయనతోపాటు బుర్రి అనిల్‌కుమార్‌నూ అదుపులోకి తీసుకున్నారు. తొలుత దాచేపల్లి, ఆ తరువాత కారంపూడి, దుర్గి, నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్లకు తిప్పారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడే బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రవికుమార్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కూడా వచ్చి నేతలతో మాట్లాడారు. సీఐ షేక్‌ ఖాజవలిని ఈ అరెస్ట్‌పై ప్రశ్నించారు. రవికుమార్‌ను కోర్టులో హాజరుపరిచే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయకులు చెప్పారు. రవికుమార్‌ తల్లిదండ్రులు సుబ్బమ్మ, సాంబయ్యను కాసు పరామర్శించారు. సుబ్బమ్మ స్పృహ తప్పడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు.

దాచేపల్లిలో కొప్పుల రవికుమార్‌ ఇంట్లో మద్యం సీసాలు పెట్టి పైశాచికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement